ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల తర్వాత.. జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఓ ప్రస్తావన వస్తోంది. ప్రతిపక్షాలు వారి పేరును పలకకుండా ఎన్నికలు పూర్తికావడంలేదంటే అతిశయోక్తికాదు. వారే వాలంటీర్లు. అవును.. వాలంటీర్లు అనే ప్రస్తావన లేకుండా ఏపీలో ఏ ఎన్నికలు జరగడం లేదు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ అర్హులకు సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు అందిస్తున్న వాలంటీర్లు ప్రతిపక్ష పార్టీలకు సింహస్వప్నాలుగా మారిపోయారు. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోయినా.. వారంటే ప్రతిపక్ష పార్టీలకు వెన్నులో […]
ప్రజాస్వామ్యం అర్థానికి వాస్తవరూపం తీసుకొస్తూ పరిపాలనలో అనేక విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రజల మేముల్లో చిరునవ్వులు చిందింపజేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన సంస్కరణలు ప్రజలకు గొప్ప సేవలను అందిస్తున్నాయి. ఇందులో పింఛన్ డోర్ డెలివరీ విధానం వృద్ధులకు ఎంతో ఉపసమనం కలిగిస్తోంది. నెల ప్రారంభంలో అందుకోవాల్సిన పింఛన్ నగదు కోసం పింపిణీ చేసే అధికారి ఎప్పుడొస్తారా..? అని ఎదురుచూపులు, వేలిముద్రలు పడలేదని పడిగాపులు, రోజుల తరబడి […]
అదృశ్య శక్తి వెనుకుండి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ను నడిపిస్తోందనే విమర్శలకు బలం చేకూరేలా నిమ్మగడ్డ పని తీరు ఉంటోంది. ఒంటెద్దు పోకడలతో ఇప్పటికే అత్యంత వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేష్కుమార్.. ఎన్నికలు జరిగే సమయంలో సర్వం తానే అన్నట్లుగా ప్రవర్తిస్తూ.. సామాన్య ప్రజలను ఇబ్బందులు పెట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా పంచాయతీ ఎన్నికలకు వలంటీర్లు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. వారి వద్ద ఉన్న ఫోన్లు కూడా వెనక్కి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ […]