iDreamPost
android-app
ios-app

APలో వాలంటీర్లకు శుభవార్త.. ఖాతాలో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం

  • Published Feb 29, 2024 | 9:17 AM Updated Updated Feb 29, 2024 | 9:17 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వాలంటీర్లకు శుభవార్త చెప్పింది. వారి ఖాతాల్లో నగదు జమ చేసింది. ఎందుకు అంటే..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వాలంటీర్లకు శుభవార్త చెప్పింది. వారి ఖాతాల్లో నగదు జమ చేసింది. ఎందుకు అంటే..

  • Published Feb 29, 2024 | 9:17 AMUpdated Feb 29, 2024 | 9:17 AM
APలో వాలంటీర్లకు శుభవార్త.. ఖాతాలో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్‌.. వాలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చింది. ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజల ఇంటి వద్దకే చేర్చడంతో పాటు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్నారు వాలంటీర్లు. ఈ క్రమంలో ప్రజలకు ఎంతో సేవ చేస్తోన్న గ్రామ, వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి ఖాతల్లో డబ్బులు జమచేసింది. ఎందుకు అంటే.. ఉత్తమ సేవలు అందిస్తోన్న వాలంటీర్లకు ప్రభుత్వం ప్రతి ఏట సన్మానం చేస్తోన్న సంగతి తెలిసిందే. వాలంటీర్లకు వందనం పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇక దీనిలో భాగంగా  అవార్డుల పంపిణీ పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 10 రోజుల పాటు ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అవార్డులకు ఎంపిక చేసిన వాలంటీర్ల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది.

ఇక వాలంటీర్లకు సేవా వజ్ర, సేవా మిత్ర, సేవా రత్న అవార్డులు అందిస్తోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సేవా వ్రజ కింద రూ.45 వేలు, సేవా మిత్ర కింద రూ.30 వేలు, సేవా రత్న కింద రూ.15 వేల నగదు బహుమతులను జ‌మ చేసిన‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. అకౌంట్‌లలో డబ్బులు పడ్డాయో లేదో చెక్‌ చేసుకోవాలని కోరింది. కొన్ని రోజుల క్రితం జగన్ సర్కార్ రాష్ట్రంలో ఉత్తమ సేవలందించిన గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సన్మానం చేసి.. సేవా మిత్ర, సేవా రత్న సేవా వజ్ర అవార్డుల ప్రదానం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు జిల్లా, ఫిరంగిపురంలో ఈ పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత నియోజకవర్గాలవారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాలంటీర్ల సేవలు చిరకాలం కొనసాగేలా వారిని మరింతగా ప్రోత్సహిస్తూ, ఇప్పటివరకు ఇస్తున్న నగదు పురస్కారాల మొత్తాన్ని ఈ ఏడాది మరింత పెంచింది ప్రభుత్వం.

రాష్ట్రవ్యాప్తంగా 2,55,464 మంది వాలంటీర్లకు గాను మొత్తంగా రూ.392.05 కోట్ల నగదు పురస్కారాలు అందించింది జగన్‌ సర్కార్‌. దీంతో పాటు, వైఎస్సార్ పెన్షన్ కానుక, ఆసరా తదితర పథకాల లబ్దిదారుల అభిప్రాయాలను సేకరించి, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా ఎంపిక చేయబడిన 997 మంది వాలంటీర్లకు ప్రత్యేకంగా నగదు బహుమతులు.. ఒక్కో వాలంటీర్‌కు మండల, పట్టణ, మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో రూ. 15 వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, జిల్లా స్థాయిలో రూ. 25 వేల చొప్పున మొత్తం రూ. 1.61 కోట్ల నగదు బహుమతుల ప్రదానం చేశారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వాలంటీర్లకు 175 నియోజకవర్గాలలో 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర పురస్కారాల ప్రదానం చేశారు. దీని కింద సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 45,000 నగదు బహుమతి అందించారు.  సేవా రత్న అవార్డుకు.. సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 30,000 నగదు బహుమతి ప్రదానం చేస్తారు. సేవా మిత్ర కింద సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్ తో పాటు రూ.15,000 నగదు బహుమతి ప్రదానం చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పని చేసిన 2,50,439 మంది వాలంటీర్లకు సేవామిత్ర పురస్కారాల ప్రదానం చేశారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişmarsbahis girişgrandpashabet