Dharani
టీడీపీ స్వార్థం వల్ల ఏపీలో తీవ్ర విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పింఛన్ కోసం ఎదురు చూస్తూ.. వృద్ధులు కన్ను మూశారు. ఆ వివరాలు..
టీడీపీ స్వార్థం వల్ల ఏపీలో తీవ్ర విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పింఛన్ కోసం ఎదురు చూస్తూ.. వృద్ధులు కన్ను మూశారు. ఆ వివరాలు..
Dharani
అవ్వాతాతలు, వికలాంగులు, ఒంటరి మహిళలను ఆదుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల పింఛన్ ఇస్తోన్న సంగతి తెలిసిందే. మిగతా రాష్ట్రాల్లో మాదిరి కాకుండా ఏపీలో వాలంటీర్లు స్వయంగా ఇంటికి వచ్చి పింఛన్ అందజేస్తారు. ప్రతి నెల ఫస్ట్ తారీఖున వాలంటీర్లు వచ్చి పింఛన్ అందజేసేవారు. కానీ తాజాగా టీడీపీ చేసిన కుట్ర కారణంగా వాలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ చేయవద్దంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా వృద్ధులు, వికలాంగులు పింఛన్ తీసుకోవడం కోసం సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మండుటెండల్లో వారు అనుభవిస్తోన్న నరకం గురించి వర్ణించడానికి మాటలు చాలవు. ఈ క్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పింఛన్ కోసం ఎదురు చూసి వృద్ధుల మృతి చెందారు. ఆ వివరాలు..
ఏపీలో పింఛన్ల కోసం వెళ్లి ఇద్దరు వృద్ధులు చనిపోయారు. నేటి నుంచి అనగా ఏప్రిల్ 3, బుధవారం నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభం కాగా.. ఉదయం నుంచి లబ్ధిదారులు సచివాలయాల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న క్రమంలోనే వేసవి భానుడి ప్రతాపాన్ని భరించలేక తిరుపతి, కృష్ణాజిల్లాలో ఇద్దరు వృద్ధులు చనిపోయారు. కృష్ణా జిల్లా గంగూరులో 80 ఏళ్ల వజ్రమ్మ అనే వృద్ధురాలు వడదెబ్బ తగిలి చనిపోయింది. పింఛన్ కోసం ఉదయం నుంచి ఎదురుచూస్తోన్న వజ్రమ్మ.. ఎండదెబ్బకు తాళలేక అస్వస్థతకు గురై.. ప్రాణాలు విడిచినట్లు స్థానికులు చెప్పుకొచ్చారు.
అలాగే తిరుపతి జిల్లా నెరబైలులోనూ మరో వృద్ధుడు కూడా పింఛన్ కోసం ఎదురు చూస్తూ ప్రాణాలు కోల్పోయాడు. పింఛన్ కోసం నేటి ఉదయం నుంచి సచివాలయం వద్ద ఎదురు చూస్తోన్న షేక్ అసం సాహెబ్ అనే వృద్ధుడు.. కళ్లు తిరిగి పడిపోయాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించేలోగా షేక్ అసం సాహెబ్ చనిపోయాడు. ప్రతి నెల మొదటి తారీఖునే వాలంటీర్లు తమ ఇంటి గడప వద్దకే వచ్చి పింఛన్లు ఇచ్చే వారని.. కానీ టీడీపీ కుట్రల కారణంగా ఈ నెల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక బుధవారం నుంచి సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. బుధవారం నుంచి అనగా ఏప్రిల్ 3 నుంచి నాలుగు రోజుల పాటు అంటే ఏప్రిల్ 6 వరకూ పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది.
అనారోగ్యంతో ఉన్నవారు, దివ్యాంగులు, వితంతువులకు ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ చేస్తారని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. అంతేకాక అయితే నాలుగు రోజుల పాటు పింఛన్ల పంపిణీ జరుగుతుందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నారు. అందరికీ పింఛన్లు అందుతాయని.. ఆందోళన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.