ముంపు బాధితులకు అండగా ఉంటామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసానిచ్చారు. ఏలూరు జిల్లా తిరుమలాపురం, నార్లవరం వరద బాధితులను ఆయన బుధవారం పరామర్శించారు. బాధితులతో మాట్లాడారు. సహాయ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో అధికారులు బాగా పనిచేశారని ప్రశంసించారు. వరద బాధితులందరికీ రేషన్ సరుకులు, కుటుంబానికి రూ.2 వేల సాయం వెంటనే అధికారులు పంపిణీ చేశారు. దీనికి కూడా వారిని అభినందిస్తున్నా. గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను ఉపంసంహరించిన నేపథ్యంలో ఇప్పుడు ఎన్యూమరేషన్ […]
అంబేద్కర్ కోనసీమ జిల్లా లంక గ్రామాల్లో సీఎం జగన్ పర్యటిస్తున్న వేళ. ఆసక్తికర సన్నివేశం కనిపించింది. వరద బాధితులను పరామర్శిస్తున్నారు. పెదపూడి లంక గ్రామంలో వాళ్లకు అందుతున్న సాయం గురించి అడిగితెలుసుకొంటూ సీఎం జగన్ ఓ 8 నెలల పిల్లవాడిని ఎత్తుకున్నారు. సీఎం జేబులోని పెన్నుతో బుడ్డోడు ఆడుకున్నాడు. ఇంతలో ఆ పెన్ను జారి కింద పడింది. పెన్నుపై పిల్లవాడి ముచ్చటను చూసిన సీఎం జగన్, ఖరీదైన పెన్ను అతనికి గిఫ్ట్‌గా ఇచ్చారు. అతను చేతితో పట్టుకున్నాడు. […]
వరదలతో అల్లల్లాడుతున్న వారందికీ అండగా ఉంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసానిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. అరిగెలవారి పేటలో బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. వారికి అందుతున్న సహాయం గురించి వాకబు చేశారు. ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కనపెట్టాలి. వరదల్లో నేను వచ్చి ఉంటే, అధికారులందరూ నా చుట్టూ తిరిగేవాళ్లు. అందుకే అధికారులకు వారం రోజుల సమయమిచ్చి, తర్వాతే నేను ఇక్కడికి వచ్చా. మీ అందరికీ మంచి చేసే బాధ్యత […]
వందేళ్లలో తొలిసారిగా జులై నెలలో, ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమంగా శాంతిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ(Dowleswaram Barrage) వద్ద వరద తగ్గుముఖం పట్టింది. వరద నీటి ఇన్ ఫ్లో, ఓట్ ఫ్లో 23.30 లక్షల క్యూసెక్కులుగా నమోదవుతోంది. పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) వద్ద కూడా గోదావరి వరద ఉద్ధృతి తగ్గుతూ వస్తోంది. ప్రాజెక్టు స్పిల్ వే వద్ద నీటి మట్టం 36.1 మీటర్లుగా నమోదైంది. 19.58 లక్షల క్యూసెక్కుల వరద నీరు 48 గేట్ల ద్వారా దిగువకు ప్రవహిస్తోంది. […]
క్లౌడ్ బరస్ట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ స్థాయిలో వరదలు వస్తాయని ఎవరూ ఊహించలేదు. క్లౌడ్ బరస్ట్ పద్ధతిలో అకస్మాత్తుగా వరదలు సృష్టిస్తున్నారని సీఎం కేసీఆర్ అనుమానించారు. ఇంతకుముందు కశ్మీర్, లేహ్ వద్ద ఇలాంటి కుట్రలు జరిగినట్లు కథనాలొచ్చాయి. ఇతర దేశాలకు క్లౌడ్ బరస్ట్‌తో ఇలాంటి కుట్రలు చేసే టెక్నాలజీ ఉందన్న చర్చ జరిగిందన్నారు. జులైలో గోదావరి ప్రాంతంలో ఇంత వరకు ఎన్నడూ లేదని, క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగినట్లు అనుమానం ఉందన్నారు. నిజాలు […]