గ్రేటర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 4 నుంచి 48 స్థానాలకు పుంజుకున్న విషయం తెలిసిందే. మజ్లిస్‌కు పెట్టని కోట అయిన ఓల్డ్ సిటీలోకి కూడా బీజేపీ బలం భారీగా పెరిగింది. బీజేపీ పాతబస్తీలో ఎంఐఎంను పెద్దగా ఢీకొట్టలేకపోయినా టీఆర్ఎస్ను మాత్రం వెనక్కి నెట్టేసింది. గతం కంటే అత్యధిక సంఖ్యలో ఓట్లను పెంచుకుంది. అంతేకాదు.. 2016లో ఆ ప్రాంతంలో టీఆర్ఎస్ సాధించిన 9 స్థానాలను కూడా బీజేపీయే సాధించింది. 2020 ఎన్నికలు జరగక ముందు వరకూ పాతబస్తీలో […]
2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 స్థానాలు సాధించి ఏకఛత్రాదిపత్యం సాధించిన టీఆర్ఎస్ 2020 ఎన్నికల్లో 55 సీట్లు సాధించింది. భారతీయ జనతా పార్టీ 48 సీట్లు పొంది ప్రధాన ప్రతిపక్ష స్థానం సాధించింది. ఎంఐఎం గత ఎన్నికల మాదిరిగానే 44 స్థానాల్లో గెలుపొంది తమకు తిరుగులేదని నిరూపించుకుంది. కాంగ్రెస్ కూడా 2016 ఎన్నికల మాదిరిగానే 2 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇదిలా ఉండగా.. మేయర్ పీఠం పొందేందుకు స్పష్టమైన మెజారిటీని ఓటర్లు ఏ పార్టీకీ ఇవ్వలేదు. సెంచరీ సాధించి […]
సీఎం కేసీఆర్ అహంకారపూరిత వైఖరిని, అవినీతిని అంతం చేసే పార్టీ బీజేపీయేనని గ్రేటర్ ప్రజలు గుర్తించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు తర్వాత బీజేపీ నేతలతో కలసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ విజయాన్ని డీజీపీ, జీహెచ్ఎంసీ కమిషనర్లకు అంకితం చేస్తున్నామని సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రజల ఆంక్షల మేరకు బీజేపీ పని చేస్తుందని చెప్పారు. ‘‘ టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై దాడి చేసినా పోలీసులు […]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అనూహ్య ఫలితాలను సాధిస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు వచ్చిన ఫలితాలను బట్టీ ఆ పార్టీ 25 లోపు స్థానాలను గెలుచుకుంటుందని అందరూ అంచనా వేశారు. అయితే ఓట్ల లెక్కింపు పూర్తయ్యే కొద్దీ బీజేపీ గెలుపొందే స్థానాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఆధిక్యంలో నిలిచే స్థానాలు పెరిగాయి. సాయంత్రం ఆరు గంటల సమయానికి 150 డివిజన్లకు గాను 122 డివిజన్లలో ఫలితాలు వెళ్లడయ్యాయి. […]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల కౌటింగ్ కొనసాగుతోంది. 150 డివిజన్లకు గాను ఇప్పటి వరకు 149 డివిజన్లకు సంబంధించి లెక్కించిన ఓట్లను వెల్లడించారు. 149 డివిజన్లలో టీఆర్ఎస్ 70 డివిజన్లు, ఎంఐఎం 45, బీజేపీ 30, కాంగ్రెస్ నాలుగు డివిజన్లలో విజయం/ఆధిక్యంలో ఉన్నాయి. 149 డివిజన్లకు సంబంధించి దాదాపు 15 డివిజన్లలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మిగతా డివిజన్లలో ఆధిక్యంలో ఉన్న పార్టీ అభ్యర్థులు భారీ ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. […]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరిచింది. యూసఫ్‌గూడలో కారు పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి రాజ్‌కుమార్ పటేల్ జయకేతనం ఎగురవేశారు. మేయర్ స్థానాన్ని గెలుచుకుంటామనే ధీమాతో ఉన్న ఆ పార్టీకి కౌంటింగ్ ఫలితాలు అనుకూలంగానే వస్తున్నాయి. ప్రస్తుతం ఆ పార్టీ 52 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 150 డివిజన్లకు గాను ఇప్పటి వరకు టీఆర్ఎస్ 52 డివిజన్లలో ఆధిక్యంలో ఉండగా.. ఒక డివిజన్లో గెలిచింది. బీజేపీ 20 డివిజన్లలో ఆధిక్యంలో […]