మూడు రాజధానుల ఏర్పాటు విషయం ఆంధ్రప్రదేశ్‌లో 44 రోజులుగా రగులుతూనే ఉంది. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని అధికార వైఎస్సార్సీపీ, ఒకే రాజధానిగా అమరావతిని కొనసాగించాలని టీడీపీ.. పట్టుదలతో ఉన్నాయి. మూడు రాజధానుల్లో ముఖ్యంగా విశాఖపైనే ఇరు పార్టీలు దృష్టి సారించాయి. న్యాయ రాజధాని అయిన రాయలసీమలోని కర్నూలు.. వార్తల్లో పెద్దగా నిలవడంలేదు. అక్కడ కేవలం హైకోర్టు, న్యాయశాఖకు చెందిన కార్యకలాపాలు మాత్రమే ఏర్పాటు చేయనుండడం ప్రధాన కారణం. సచివాలయం, సీఎంవో, శాఖాధిపతుల కార్యాలయాలు ఏర్పాటు చేసే కార్యానిర్వాహఖ […]
ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన రిటైర్డ్ ఐఏయస్ అధికారి జియన్ రావు అధికార వికేంధ్రీకరణ, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి అంశాలపై తాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక లో విశాఖపట్టణం రాజధానిగా పనికిరాదంటూ సూచించినట్టుగా ఈ ఉదయం నుండి కొన్ని చానెళ్లలో ప్రసారమౌతున్నవార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. అభివృద్ధి, అధికార వికేంధ్రీకరణలో భాగంగా కార్యనిర్వాహక రాజధాని ని విశాఖపట్టణంలో ఏర్పాటు చెయ్యాలని తమ కమిటీ ప్రభుత్వానికి సూచించిందని, దానిలో భాగంగా ప్రభుత్వ […]
ఈరోజు అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంధ్రీకరణ అంశాలపై జరిగిన చర్చలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నాబాబు మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలో పౌరులందరూ సమానమేనన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా సమాజ ప్రయోజనాలు ముఖ్యమని అన్నారు. అన్ని ప్రాంతాలతో సమానంగా వెనుకబడిన ప్రాంతాలను కూడా అభివృద్ధి చెయ్యాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉందన్నారు. గతంలో అభివృద్ధి వికేంధ్రీకరణ జరగగాపోవడం వల్లే తెలంగాణా ఉద్యమం వచ్చి రాష్ట్రం చీలిపోయిందని, ఆ అనుభవాల నుండి మనం ఇప్పటికైనా గుణపాఠం […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సమావేశంలో ప్రధానంగా హైపవర్ కమిటీ నివేదికపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. జీఎన్‌రావు, బీసీజీ నివేదికలను క్షుణ్నంగా అధ్యయనం చేసిన హైపవర్ కమిటీ రాష్ట్ర అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణపై ప్రభుత్వానికి మార్గదర్శంన చేసేలా నివేదిక రూపాందించింది. Read Also: ఏపీ కేబినెట్ తీర్మానాలు ఇవే.. మూడు రాజధానుల ఏర్పాటుతో సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రత్యేక […]
రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై చర్చించేందుకు ఏర్పాటైన హైపవర్ కమిటీ శుక్రవారం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తో సమావేశం అయింది. జీఎన్ రావు, బీసీజీ నివేదికలను పరిశీలించిన హైపవర్ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి పవర్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే రాజధాని రైతుల సమస్యలపై హైపవర్ కమిటీ సభ్యులు సీఎం తో చర్చించనున్నారు. ఇప్పటికే మూడు సార్లు సమావేశమైన హైపవర్ కమిటీ సభ్యులు జీఎన్ రావు, బీసీజీ నివేదికలపై విస్తృతంగా చర్చలు జరిపిన సంగతి […]