iDreamPost
android-app
ios-app

సీబీఐ కోర్టులో సీఎం జగన్ కు స్వల్ప ఊరట

సీబీఐ కోర్టులో సీఎం జగన్ కు స్వల్ప ఊరట

రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై చర్చించేందుకు ఏర్పాటైన హైపవర్‌ కమిటీ శుక్రవారం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తో సమావేశం అయింది. జీఎన్‌ రావు, బీసీజీ నివేదికలను పరిశీలించిన హైపవర్‌ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి పవర్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. అలాగే రాజధాని రైతుల సమస్యలపై హైపవర్‌ కమిటీ సభ్యులు సీఎం తో చర్చించనున్నారు. ఇప్పటికే మూడు సార్లు సమావేశమైన హైపవర్‌ కమిటీ సభ్యులు జీఎన్‌ రావు, బీసీజీ నివేదికలపై విస్తృతంగా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.

జగన్ ఆస్తుల కేసుపై ఈరోజు సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ రోజు జరుగుతున్న విచారణకు తాను హాజరు కాలేకపోతున్నానంటూ జగన్ సిబిఐ కోర్టులో ఆబ్సెంట్ పిటిషన్ ని దాఖలు చేశారు. జగన్ తరపు న్యాయవాదులు దాఖలు చేసిన ఈ ఆబ్సెంట్ పిటిషన్ ని విచారణకి స్వీకరించిన కోర్ట్ ఈరోజు జగన్ కి వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇచ్చింది. ఇదే కేసులో సహ నిందితులుగా ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తో పాటుగా తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, విడి రాజగోపాల్ లు కోర్టుకి హాజరవ్వడం జరిగింది.

అయితే ఆస్తుల కేసులో జగన్ మోహన్ రెడ్డి ప్రతి వారం విచారణకి హాజరవ్వాల్సి ఉండగా ముఖ్యమంత్రి అయిన తరువాత వ్యక్తిగత విధుల వల్ల కోర్టుకి హాజరు కాకపోవడంతో, ఈసారి కోర్ట్ విచారణకు జగన్ తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనంటూ ఈ నెల 3 న కోర్టు నోటీసులు ఇవ్వడంతో గత వారం సిబిఐ కోర్టుకి హాజరైన జగన్ తనకు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని, తన తరపున తన లాయర్ హాజరౌతారని కోర్టులో ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ తరపు లాయర్ దాఖలు చేసిన ఆబ్సెంట్ పిటిషన్ పై ఈరోజు కోర్టులో విచారణ జరిగింది. ఇదే సమయంలో ఈడీ కి సంబంధించిన కేసులో కూడా తనకు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన ఆబ్సెంట్ పిటిషన్ ని విచారణకి స్వీకరించిన కోర్ట్ ఈ కేసులో తీర్పుని రిజర్వు చేసి తదుపరి విచారణ ని ఈనెల 24 కి వాయిదా వేసింది.