వై.యస్ జగన్ ముఖ్యమంత్రి అయిన రోజు నుండి చేస్తున్న పనులకి వివిధ వర్గాల నుండి ప్రశంశలు వస్తూనే ఉన్నాయి. పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు పొరుగు రాష్ట్రాల పాలకులు సైతం ఆకర్షితులవుతున్నారు. దిశా చట్టం పత్రాలను డిల్లీ , ఒడిస్సా ముఖ్యమంత్రులు కోరటం, రివర్స్ టెండరింగ్ పద్దతి గురించి ఇతర రాష్ట్రాలు ఆరా తీయటం లాంటి సంఘటనలతో ముఖ్యమంత్రి జగన్ దేశంలోని వివిధ రాజకీయ నాయకుల దృష్టిని ఆకర్షించారు. […]
హైదరాబాద్ శివారులో జరిగిన దిశ హత్యాచార ఘటన తెలంగాణ ప్రభుత్వంపై ఎంతమేరకు ప్రభావం చూపిందో తెలియదు కానీ పొరుగురాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాత్రం ఎక్కువగా ప్రభావం చూపింది. దిశ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఆడవారిపై అత్యాచార ఘటనలు నివారించడానికి దిశా చట్టం ఏర్పాటు చేయడం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచి చర్చనీయాంశం అయింది. మహిళలపై జరిగే అత్యాచారాలను నిరోధించేలా […]
ఏపీలో మందు బాబులుల్లో మార్పు వస్తోందా.. మెల్లి మెల్లిగా మద్యం కోరల్లోనుంచి బయటపడుతున్నారా ? పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. గణాంకాలు సైతం ఇదే విషయాన్ని వెల్లడిస్తుండటంతో ఏపీలో మత్తు వదులుతోందని భావించాల్సిందే. దశలవారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుచేస్తామని ఎన్నికల్లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగా అధికారం చేజిక్కించుకున్న వెంటనే బెల్టు షాపులకు మంగళం పాడారు . దీంతో పాటు నూతన మద్యం పాలసీ తెచ్చి […]
మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ దండన విధించేలా తాజాగా తీసుకొచ్చిన ‘దిశ’ చట్టం పక్కాగా అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగానికి మార్గదర్శనం చేశారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఈ విషయమై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు జిల్లాకు ఒకటి చొప్పున 13 ప్రత్యేకకోర్టులకు అవసరమైన బడ్జెట్‌ను వెంటనే కేటాయించాలని సీఎం ఆదేశించారు. ప్రతి కోర్టుకూ సుమారు రూ.2 కోట్లు అవసరం అవుతాయని […]