iDreamPost
android-app
ios-app

ఏపీలో మద్యం మత్తు వదులుతోంది…!

ఏపీలో మద్యం మత్తు వదులుతోంది…!

ఏపీలో మందు బాబులుల్లో మార్పు వస్తోందా.. మెల్లి మెల్లిగా మద్యం కోరల్లోనుంచి బయటపడుతున్నారా ? పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. గణాంకాలు సైతం ఇదే విషయాన్ని వెల్లడిస్తుండటంతో ఏపీలో మత్తు వదులుతోందని భావించాల్సిందే. దశలవారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుచేస్తామని ఎన్నికల్లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగా అధికారం చేజిక్కించుకున్న వెంటనే బెల్టు షాపులకు మంగళం పాడారు . దీంతో పాటు నూతన మద్యం పాలసీ తెచ్చి మద్యం ఏరులై పారకుండా అడ్డుకట్ట వేశారు.

మద్యం చేసే అక్రుత్యాలెన్నో

మద్యం మనిషిని మూర్కుడిగా చేస్తుంది. తాగిన మైకంలో కూతురిపై తండ్రి అఘాయిత్యం. తాగిన మైకంలో స్నేహితుడినే హత్య చేసిన ఉదంతం. పేపర్ తెరిస్తే ఇలాంటి వార్తలు కోకొల్లలు. తాజాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా అత్యాచారం, హత్య ఘటనకు మద్యమే మూల కారణంగా ఉంది. సమాజాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మతల్లో మద్యం ముందు వరుసలో ఉంటుంది. మద్యపాన నిషేధం అంశం చర్చకు వచ్చిన ప్రతిసారీ సారాకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన నెల్లూరు జిల్లా కలిగిరి మండలం దూబగుంట గ్రామానికి చెందిన రోశమ్మ పేరు ప్రస్తావనకు వస్తుంది. మద్యం వల్ల ఇల్లు గుల్లయి, రోదిస్తున్న రోశమ్మ వంటి మహిళలు ప్రతి పట్టణం, ప్రతి పల్లెలో ఉన్నారు. కాబట్టే మద్యాన్ని నిషేదించాలని డిమాండ్ సజీవంగా ఉంటోంది.

మద్యాన్ని ఆదాయవనరుగా మార్చిందెవరు

నిస్సందేహంగా చంద్రబాబే అని చెప్పొచ్చు. ఎన్టీ రామారావు మద్య నిషేధాన్ని అమలు చేసి ప్రజల హృదయాలలో నిలిచినారు. ఎన్టీఆర్ ను దింపి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మద్యాన్ని మరలా ప్రవేశపెట్టాడు. రాష్ట్రం విడిపోయి 2014లో తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. అప్పుడైనా మద్యనియంత్రణ దిశగా ఆలోచిస్తారంనుకొంటే.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఆయన్ను మరింత ముందుకు తోసింది. దీంతో వీధికో బెల్ట్ షాప్ తెరచి మద్యం అమ్మకాలను ప్రోత్సహించారు. ఈ పరిస్థితి ఏ స్థాయికి వెళ్లిందంటే ఏకంకా మద్యం ఆదాయంపైనే ఆధారపడి పలు సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేసేవరకు.

ఏ ధైర్యంతో జగన్ ముందుకు

రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్పుల్లో ఉంది… ఓ వైపు అనేక సంక్షేమ కార్యక్రమాలు.. పైగా అవన్నీ ఉచితాలే. ఇలాంటి పరిస్థితుల్లో మద్యం పై వచ్చే ఆదాయాన్ని వదులుకోవడం అంటే ఒకటికి ఆషామాషీ కాదు. కానీ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి దశలు వారీగా మద్య నిషేదానికి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వమే మద్యం విక్రయించటం ప్రారంభించింది. మద్యం అమ్మకాలను రాత్రి 8 గంటలకు వరకే పరిమితం చేసింది. బార్ల సంఖ్యను కుదించి, మద్యం రేట్లను భారీగా పెంచింది.

గణాంకాలు ఇలా

అక్టోబర్‌ నుండి ప్రభుత్వమే మద్యం అమ్మకాలు సాగిస్తోంది. అమ్మే వేళలు తగ్గించడం వలన చాలా మంది తాగటం తగ్గించారు. షాపుల సంఖ్యను మరింత తగ్గిస్తే తాగటం బాగా తగ్గుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో 2018 అక్టోబర్‌–నవంబర్‌ నెలలో లిక్కర్‌ 6,36,402 కేసులు, బీరు 5,04,164 కేసుల ద్వారా మొత్తం అమ్మకం 332.59 కోట్లు కాగా, అదే 2019లో షాపుల సంఖ్య తగ్గించి అక్టోబర్‌–నవంబరు రెండు నెలలు లిక్కర్‌ 5,52,477 కేసులు, బీరు 1,90,419 కేసులకు గానూ మొత్తం రూ 384 కోట్ల అమ్మకం జరిగింది. అంటే.. 3,97,670 కేసుల మద్యం అమ్మకాలు తగ్గినట్లు అర్ధమవుంది. దీనిని బట్టి దాదాపు సగటు మద్యపాన ప్రియుల సంఖ్య గణనీయంగా తగ్గినట్టే. ఇది ప్రభుత్వ విజయంగా భావించవచ్చు.

తాజా ప్రభుత్వ చర్యలతో గ్రామీణ ప్రాంతాల్లోని కొంతమంది మద్యపానప్రియులు గతంలో క్వాటర్ తాగితే ప్రస్తుతం 90 ఎంఎఎల్తో సరిపెట్టుకుంటున్నారు. అంటే రోజుకు రూ.60/లు మిగిలితే నెలకు రూ. 1,800/లు ఒక కుటుంబానికి మిగులుతుంది. ఈ పరిణామాలను బట్టి గ్రామీణ ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుండడం ఖాయంగా కనిపిస్తోంది. ఐతే దీని వల్ల రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోతుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. నేరుగా ఆదాయం పడిపోయినా గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి పెరగటం వలన రాష్ట్ర ఆదాయం పెరగటం ఖాయం.

సవాళ్లు ఉంటాయి

మద్యపాన నిషేధం అమలు ఏమంత సులభం కాదు. గతానుభవాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం మద్యం విక్రయించక పొతే నాటు సారా ప్రబలే అవకాశం ఉంది. ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే ఇతర రాష్ట్రాల నుండి మద్యం అక్రమ రవాణా జరిగే అవకాశం ఉంది. పోలీసులు, ఎక్సయిజ్ అధికారులు మద్య నిషేధాన్ని ఆసరాగా చేసుకొని లంచాలు దండుకొని అవకాశం ఉంది. వీటిని అరికట్టడం సీఎంకి ఒక రకంగా చాలెంజ్‌. నాటు సారా కేసులలో దొరికిన వారికి కనీసం 6 నెలల నుండి రెండు సంవత్సరాలు జైలు శిక్షవిధించేలా చట్టం చేయడం, లంచాలు తీసుకున్న అధికారుల పైనా శాఖా పరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు పెట్టడం చేస్తే సంపూర్ణ మద్యపాన తప్పక నిషేధం విజయవంతం అవుతుంది.