కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. మొదటి వేవ్ కన్నా.. ఈ సారి పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా రోజు వారీ కేసులు మూడు లక్షల వైపునకు పరిగెడుతున్నాయి. ఏపీలోనూ కొత్త కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ప్రస్తుతం రోజు వారీగా ఏడు వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైరస్ కట్టడిపై సమాలోచనలు చేస్తోంది. నైట్ కర్ఫ్యూను విధించాలని సర్కార్ యోచిస్తోంది. లాక్‌డౌన్ కాకుండా.. కరోనా […]
కరోనా సెకండ్ వేవ్ దేశంలో కల్లోలం రేపుతోంది. అన్ని రంగాలనూ మరోసారి కుదిపేస్తోంది. పాజిటివిటీ రేటు రోజురోజుకూ పెరుగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ పారిశ్రామిక వేత్తల నుంచి పొలిటికల్ లీటర్ల వరకూ ప్రతి ఒక్కరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే యూపీ సీఎం ఆదిత్యనాధ్, కేరళ సీఎం పినరాయి విజయన్‌తో సహా పలువురు పొలిటికల్ లీడర్స్‌కు కరోనా పాజిటివ్ తేలగా.. నిన్న ఆ లిస్టులోకి కర్ణాటక సీఎం యడ్యూరప్ప కూడా చేరారు. ఇటీవల ఆయన కరోనా […]
కంటికి కన్పించిన ఓ క్రిమి నానా పాట్లు పెడుతోంది. దీని భారి నుంచి తోటి మనుషులను కాపాడుకోవడానికి తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా యంత్రాంగం సేవలందిస్తోంది.. ఇటువంటి పరిస్థితుల్లో పౌరుడిగా ఎంత బాధ్యతగా ఉండాలి.. అందులోనూ కాస్తంత అక్షరజ్ఞానం ఉన్న వాళ్ళు ఇంకెంత బాధ్యతగా వ్యవహరించాలి.. తనకు తాను జాగ్రత్తగా ఉండడంతో పాటు.. తోటి వారిని హెచ్చరిస్తూ వాళ్ళు కూడా జాగ్రత్తపడే విధంగా చైతన్య పరచాలి. అంతేగానీ ఇవేమీ పట్టకుండా తమ మానాన తాము తప్పించుకు […]
మానవజాతి మనుగడకు కరోనా వైరస్ పెను ముప్పుగా మారుతోంది. మానవ మేథస్సును సవాల్ చేస్తోంది. రూపు మార్పుకుంటూ అంతుచిక్కకుండా వ్యాపిస్తోంది. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందనే ఆనందం ఆవిరయ్యేలా.. వైరస్ కొత్త రూపును సంతరించుకుని విజృంభిస్తోంది. తాజాగా బ్రిటన్‌లో వెలుగులోకి వచ్చిన స్ట్రెయిన్ వైరస్ ఆ దేశాన్ని వణికిస్తోంది. ఇతర దేశాలకు ఈ వైరస్ వ్యాపిస్తోంది. బ్రిటన్‌తో రాకపోకలను అన్ని దేశాలు బంద్ చేసుకున్నా.. ఇప్పటికే స్ట్రెయిన్ వైరస్ ఇతర దేశాలకు వ్యాపించింది. భారత్‌లోకి ఈ […]
కొత్త కరోనా రూపంలో ప్రపంచానికి కొంగొత్త సవాళ్లు ఎదురుకానున్నాయా..? వాటిని ముందస్తుగా ఎదుర్కోకపోతే మళ్లీ ముప్పు తప్పదా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. బ్రిటన్‌లో పంజా విసురుతున్న కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కొవిడ్-19 కారక కరోనా వైరస్ రూపాంతరం చెంది వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ 70 శాతం వేగంగా వ్యాపిస్తోందని బ్రిటన్ […]
కోవిడ్ 19 వైరస్ మార్పు చెందుతోంది. ఇప్పటికే నిపుణులు తేల్చి చెప్పిన మాట. అయితే ఈ మార్పు ద్వారా ఏర్పడే ప్రమాదం లేదా ప్రయోజనం ఏంటన్నది ఇంకా పరిశోధనల స్థాయిలోనే ఉందని తేల్చారు. అయితే యూకే, బ్రిటన్ వంటి చోట్ల గుర్తించిన వైరస్ మ్యుటేషన్ కారణంగా వ్యాధి వ్యాప్తి తీవ్రత పెరిగిందని అంచనా వేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆందోళన పరిచే అంశంగానే నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆసియా దేశాలతో పోలిస్తే ప్రమాద త్రీవత యూరోప్ దేశాల్లో ఎక్కువగానే ఉందుంటున్నారు. […]
కోవిడ్ 19ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. డిసెంబరు 31 వరకు అన్ని అంతర్జాతీయ సర్వీస్‌లను నిలిపివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనుమతించిన తరువాతనే మన దేశంలో కోవిడ్ విజృంభణ ప్రారంభమైందని ఒక వాదన కూడా విన్పించేది. కారణం ఏదైనా విదేశాలకు రాకపోకలపై ఆంక్షలను వచ్చేనెల వరకు పొడిగించి కోవిడ్ కట్టడికి తన అప్రమత్తతను ప్రభుత్వం తేటతెల్లం చేసింది. అయితే ప్రభుత్వాలు చెబుతున్న మాటలు, పెడుతున్న ఆంక్షలను ఫాలో […]
కోవిడ్ 19 నిబంధనల అన్‌లాక్ తరువాత జనజీవనం సాధారణ స్థితికి చేరుతున్నట్లుగా పైకి కన్పిస్తున్నప్పటికీ అంతర్గతంగా జనంలో కరోనా తాలూకు భయం మాత్రం అలాగే కొనసాగుతోంది. ఇందుకు పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు తరలివచ్చే యాత్రీకులనే ఉదాహరణగా చూపుతున్నారు. ముఖ్యంగా కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప దర్శనానికి గణనీయంగా తగ్గిపోయిన భక్తుల సంఖ్యే కోవిడ్ పట్ల జనం తీరును తెలియజేస్తోందని అంచనా వేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల ఆలయానికి ప్రతియేటా లక్షల్లోనే భక్తులు వెళుతుంటారు. […]
అందరూ సంతోషంగా దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చే దీపావళికి సిద్ధమయ్యారు. వయస్సులతో సంబంధం లేకుండా అందరూ సంబరపడే పండుల్లో ఇదీ ఒకటి. అయితే 2020 మాత్రం ఈ పండుగను కూడా పరిమితంగా చేసేసిందనే చెప్పాలి. కోవిడ్ విస్తృతి కారణంగా ఇప్పటి వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ లక్షలాది మందికి వైరస్ వ్యాపించింది. ఇందులో అత్యధికశాతం మంది పూర్తిగా కోలుకుని ఇళ్ళకు చేరుకున్నారు. మరికొందరు చికిత్స పొందుతున్నారు. అయితే పాజిటివ్ నుంచి కోలుకున్న వారిలో కొందరికి పోస్ట్ కోవిడ్ […]
పల్లె– పట్నంకు ఎంత తేడా ఉంటుందో చిన్న పట్టణం– నగరానికి అంతే తేడా ఉంటుంది. నగరీకరణ గత ఇరవయ్యేళ్ళుగా ప్రతియేటా పెరిగిపోతూనే ఉంది. దీంతో నగరాల విస్తీర్ణం కూడా అదే రీతిలో పెద్దదవుతోంది. అయితే హఠాత్తుగా వచ్చిపడ్డ కోవిడ్ నగర జీవన గతుల్ని మార్చేస్తోందంటున్నారు నిపుణులు. సాధారణంగా నగరాలకు వచ్చే వలసలకు ప్రదాన కారణాలు రెండు. వాటిలో ఒకటి ఉద్యోగం కాగా రెండు విద్య. కోవిడ్ కారణంగా ఈ రెండింటికీ ఆటంకం కలిగింది. దీంతో ఉద్యోగులు, విద్యార్ధులు […]