iDreamPost
android-app
ios-app

ఫస్ట్ టైం డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్.. దర్శకుడు ఎవరంటే?

  • Published May 01, 2024 | 5:45 PM Updated Updated May 01, 2024 | 5:45 PM

ఇప్పటి వరకూ అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం సినిమాలు చేయలేదు. అయితే ఫస్ట్ టైం తన కెరీర్ లో డ్యూయల్ రోల్ లో నటించబోతున్నారని టాక్. ఇంతకే దర్శకుడు ఎవరంటే?

ఇప్పటి వరకూ అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం సినిమాలు చేయలేదు. అయితే ఫస్ట్ టైం తన కెరీర్ లో డ్యూయల్ రోల్ లో నటించబోతున్నారని టాక్. ఇంతకే దర్శకుడు ఎవరంటే?

  • Published May 01, 2024 | 5:45 PMUpdated May 01, 2024 | 5:45 PM
ఫస్ట్ టైం డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్.. దర్శకుడు ఎవరంటే?

హీరోలు డ్యూయల్ రోల్ లో నటిస్తే చూడాలని ప్రతి హీరో ఫ్యాన్ కి ఉంటుంది. నిజానికి అదొక ఎమోషన్. ఇది ఈనాటిది కాదు. డ్యూయల్ రోల్ అంటే ఒక కొత్తదనం ఉంటుందని అభిప్రాయపడతారు. పలానా సినిమాలో ఇద్దరు చిరంజీవులురా.. ఇద్దరు ప్రభాస్ లురా అని సరదాగా చెప్పుకుంటారు ఫ్యాన్స్. ఇక ఆ హీరోలిద్దరూ తలబడితే ఆ కథ వేరే లెవల్ ఉంటుంది. విక్రమార్కుడు, దరువు వంటి సినిమాల్లో రవితేజ, నాయక్ సినిమాలో రామ్ చరణ్, అదుర్స్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, బాహుబలిలో ప్రభాస్ ఇలా యంగ్ స్టార్స్ అంతా డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించారు. ఎన్టీఆర్ ఇంకో అడుగు ముందుకేసి జై లవకుశ సినిమాలో ఏకంగా త్రిపాత్రాభినయంలో కనిపించి అదరగొట్టారు. తాజాగా ఈ హీరోల జాబితాలోకి అల్లు అర్జున్ చేరిపోయినట్లు తెలుస్తోంది. 

పుష్ప సినిమాతో జాతీయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ తన కెరీర్ లో ఇప్పటి వరకూ డ్యూయల్ రోల్ లో నటించలేదు. తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 ది రూల్ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా దీని తర్వాత ఐకాన్ స్టార్ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటి? ఏ డైరెక్టర్ తో చేయనున్నారు? అనే దాని గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో బన్నీ మూవీ చేయబోతున్నారన్న వార్తలు వచ్చాయి కానీ ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. కథ విషయంలో బన్నీ సంతృప్తికరంగా లేనందుకే ఆలస్యం అవుతుందని టాక్ నడుస్తోంది.

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే నాలుగో మూవీలో డ్యూయల్ రోల్ లో నటించబోతున్నారని టాక్ నడుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జోనర్ ని పక్కన పెట్టి ఫాంటసీ సబ్జెక్ట్ ని ఎంచుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారట. ఈ మూవీలో బన్నీ రెండు పాత్రల్లో కనిపిస్తారని.. ఈ రెండు పాత్రలు సంబంధం లేకుండా ఉంటాయని టాక్. షాకింగ్ ఎలిమెంట్స్ తో థ్రిల్ కి గురి చేసేలా ఉంటాయని చెబుతున్నారు. జూలై నెలలో దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశముంది. మరి అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నారంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.  

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetcratosroyal girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio