iDreamPost

వైరస్‌ ‘కొత్త’ కలకలం..!

వైరస్‌ ‘కొత్త’ కలకలం..!

కోవిడ్‌ 19 వైరస్‌ మార్పు చెందుతోంది. ఇప్పటికే నిపుణులు తేల్చి చెప్పిన మాట. అయితే ఈ మార్పు ద్వారా ఏర్పడే ప్రమాదం లేదా ప్రయోజనం ఏంటన్నది ఇంకా పరిశోధనల స్థాయిలోనే ఉందని తేల్చారు. అయితే యూకే, బ్రిటన్‌ వంటి చోట్ల గుర్తించిన వైరస్‌ మ్యుటేషన్‌ కారణంగా వ్యాధి వ్యాప్తి తీవ్రత పెరిగిందని అంచనా వేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆందోళన పరిచే అంశంగానే నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆసియా దేశాలతో పోలిస్తే ప్రమాద త్రీవత యూరోప్‌ దేశాల్లో ఎక్కువగానే ఉందుంటున్నారు. ఇందుకు అక్కడి భిన్న అంశాలను కారణాలుగా చూప్తున్నారు.

అయితే కోవిడ్‌ విషయంలో బిన్న వైరస్‌ వేరియంటర్లను మొదటి నుంచి నిపుణులు గుర్తిస్తూనే ఉన్నారు. ఒక్కో వేరియంటో ఒక్కో విధంగా వ్యాప్తి విషయంలో ప్రభావం చూపుతోందని వివరిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇతర దేశాల్లో గుర్తించిన ఈ వేరియంట్‌ కూడా తన ప్రభావాన్ని విస్తృతంగానే చూపుతోందని ఆయా దేశాల్లో పాజిటివ్‌ల సంఖ్య పెరిగిపోవడానికి ఈ కొత్త మ్యుటేషనే కారణమంటున్నారు.

ఇప్పటికే ఆయాదేశాల్లో లాక్డౌన్‌ నిబంధనలను కఠినతరం చేస్తున్నారు. క్రిస్మస్‌ సంబరాలు నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించే విధంగా కఠినంగా నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. మరోవైపు మనదేశంలో కూడా వైరస్‌ వ్యాప్తికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా శీతాకాలంలో వైరస్‌ సంబంధిత వ్యాధులు విజృంభిస్తాయి. ఈ వాతావరణ పరిస్థితులు కోవిడ్‌ వ్యాప్తికి కూడా అనుకూలంగా ఉంటాయని చెబుతున్నారు.

మరో పక్క కోవిడ్‌ లక్షణాలు, సీజనల్‌ వ్యాధుల లక్షణాలు దాదాపు ఒకే విధంగా ఉండడంతో ప్రజలు నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. సంబంధిత లక్షణాలు ఉంటే ఎటువంటి అలక్ష్యం చేయకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకుని, వైద్యుల సలహాలు పాటించాలని చెబుతున్నారు. దీంతో పాటు జన సమూహాలకు దూరంగా ఉండడం, మాస్కు ధరించడం, చేతులను పరిశుభ్రం చేసుకోవడం తప్పకుండా పాటించాలని చెబుతున్నారు. లేకపోతే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకు తోడు నిర్లక్ష్యంగా జతైతే వైరస్‌ తన విస్తృతుని చాటుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి