iDreamPost

టీ20 వరల్డ్‌ కప్‌ పోయినట్టేనా? టీమ్‌ ప్రకటించిన తర్వాత గట్టి ఎదురుదెబ్బ..!

  • Published May 02, 2024 | 9:09 AMUpdated May 02, 2024 | 9:09 AM

T20 World Cup 2024: ఇండియన్‌ క్రికెట్‌ అభిమానులంతా రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ, వరల్డ్‌ కప్‌ ఆడబోయే టీమిండియా స్టార్లు మాత్రం అభిమానుల ఆశలపై ఇప్పుడే నీళ్లు చల్లుతున్నారు.

T20 World Cup 2024: ఇండియన్‌ క్రికెట్‌ అభిమానులంతా రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ, వరల్డ్‌ కప్‌ ఆడబోయే టీమిండియా స్టార్లు మాత్రం అభిమానుల ఆశలపై ఇప్పుడే నీళ్లు చల్లుతున్నారు.

  • Published May 02, 2024 | 9:09 AMUpdated May 02, 2024 | 9:09 AM
టీ20 వరల్డ్‌ కప్‌ పోయినట్టేనా? టీమ్‌ ప్రకటించిన తర్వాత గట్టి ఎదురుదెబ్బ..!

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం సెలెక్టర్లు మంగళవారం భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ కంటే ముందు టీ20 క్రికెట్‌లో చేసిన ప్రదర్శన, దేశవాళి టీ20 టోర్నీల్లో చూసిన ప్రతిభ, ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్న విధానం చూసి.. 15 మందితో కూడిన స్క్వౌడ్‌ను, అలాగే నలుగురు స్టాండ్‌బై ప్లేయర్లను ఎంపిక చేశారు. టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో ఉంటారని ఊహించిన చాలా మంది యువ క్రికెటర్లకు చోటు దక్కలేదు. ఐపీఎల్‌తో పాటు దేశవాళి క్రికెట్‌లో అద్భుత ప్రతిభ చూపిన వారికి కూడా వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటు దక్కలేదు. ముఖ్యంగా రింకూ సింగ్‌, రియాన్‌ పరాగ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ లాంటి ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. అలాగే ఎంపికైన కొంతమంది ఆటగాళ్లపై కూడా క్రికెట్‌ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది.

క్రికెట్‌ అభిమానులు ఊహించనట్లుగానే అలా టీమ్‌ ప్రకటించిన నెక్ట్స్‌ డేనే కొంతమంది ఆటగాళ్లు దారుణంగా విఫలం అయ్యారు. దీంతో.. మరోసారి క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఆయా ఆటగాళ్లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో ఉన్న స్క్రాప్‌ ఇదేనంటూ తిట్టిపోస్తున్నారు. ఇంతకీ వారి కోపానికి కారణం ఏంటంటే.. మంగళవారం బీసీసీఐ భారత టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అదే రోజు సాయంత్రం ముంబై ఇండియన్స్‌, లక్నో సూపర్‌ జెయింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. అలాగే బుధవారం పంజాబ్‌ కింగ్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. వీటిలో లక్నో టీమ్‌ నుంచి ఎవరికీ వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటు దక్కలేదు.

కానీ, ముంబై నుంచి నలుగురు ఆటగాళ్లు.. రోహిత్‌ శర్మ, హార్ధిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా ఉన్నారు. అలాగే చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌ నుంచి శివమ్‌ దూబే, రవీంద్ర జడేజాలు ఉన్నారు. పంజాబ్‌ కింగ్స్‌ నుంచి అర్షదీప్‌ సింగ్‌కు అవకావం దక్కింది. ఇలా ఈ మూడు టీమ్స్‌ నుంచి ఏడుగురు ప్లేయర్లు టీ20 వరల్డ్‌ కప్‌లో ఆడబోతున్నారు. కానీ, అలా జట్టు ప్రకటించగానే.. వీరి ప్రదర్శన తుస్సు మంది. రోహిత్‌ శర్మ 4, హార్ధిక్‌ పాండ్యా 0, సూర్యకుమార్‌ యాదవ్‌ 10, శివమ్‌ దూబే 0, జడేజా 2 పరుగులు చేసి.. చాలా తీవ్రంగా నిరాశ పరిచారు. ఇక బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న చెన్నై పిచ్‌పై అర్షదీప్‌ సింగ్‌ 4 ఓవర్లలో ఏకంగా 52 పరుగులు సమర్పించుకున్నాడు. వీరిలో జస్ప్రీత్‌ బుమ్రా ఒక్కడే.. మంచి ప్రదర్శన చేశాడు. అయితే.. ఒక్క మ్యాచ్‌తోనే వీరిని తక్కువ అంచనా వేయలేం కానీ, టీమ్‌ ప్రకటించిన నెక్ట్స్‌ మ్యాచ్‌లోనే మరి ఇంత దారుణంగా విఫలం కావడం మాత్రమ కలవరపెడుతోంది. ఈ టీమ్‌తో వరల్డ్‌ కప్‌కు వెళ్తే.. కప్పు కాదు కదా, కనీసం గ్రూప్‌ స్టేజ్‌ కూడా దాటేలా లేం అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి