iDreamPost

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్.. ఆ పార్టీ తరఫున బరిలోకి!

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు ఓ స్టార్ క్రికెటర్. ఆ పార్టీ తరఫున పార్లమెంటరీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నాడు. అవకాశం ఇస్తే ప్రధాన మంత్రి అవుతానని ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఆ ప్లేయర్.

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు ఓ స్టార్ క్రికెటర్. ఆ పార్టీ తరఫున పార్లమెంటరీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నాడు. అవకాశం ఇస్తే ప్రధాన మంత్రి అవుతానని ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఆ ప్లేయర్.

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్.. ఆ పార్టీ తరఫున బరిలోకి!

క్రికెటర్లు, సినీ ప్రముఖులు రాజకీయాల్లో రావడం ప్రస్తుతం సర్వసాధారణం  అయిపోయింది. ఇప్పటికే ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లు, సినీ నటులు, నటీమణులు పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చి దూసుకెళ్తున్న విషయం మనకు తెలియనిది కాదు. ఇక త్వరలోనే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఎంతో మంది నటీ, నటులు బరిలోకి దిగుతున్నారు.  కాగా.. ఓ స్టార్ క్రికెటర్ సైతం ఆ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగబోతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రాబోయే యూకే సార్వత్రిక ఎన్నికల్లో జార్జ్ గాల్లోవే వర్కర్స్ పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ కూడా ధృవీకరించింది. వామపక్ష భావాజాలం కలిగిన గాల్లోవే.. తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్న 200 మంది సభ్యుల లిస్ట్ లో ఉన్నాడని తెలిపాడు. కాగా.. పశ్చిమ లండన్ లోని ఈలింగ్ సౌతాల్ నియోజకవర్గం నుంచి పనేసర్ పోటీ చేయనున్నాడు. ఇక ఇంగ్లండ్ కు 50 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన పనేసర్ 167 వికెట్లు పడగొట్టాడు. భారత్(పంజాబ్) నుంచి వలస వచ్చిన సిక్కు దంపతులకు అతడు జన్మించాడు. ఇక తన పొలిటికల్ ఎంట్రీపై స్పందిస్తూ..

A star cricketer entering politics

“రాజకీయాల్లోకి వచ్చి.. ఏదో ఒకరోజు ప్రధాన మంత్రి కావాలన్నదే నా కోరిక. దాంతోపాటుగా దేశంలోని కార్మికుల గొంతుకగా నిలుస్తాను. నాకు అవకాశం ఇస్తే.. బ్రిటన్ ను సురక్షితమైన, బలమైన దేశంగా మారుస్తాను. అయితే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం ఈలింగ్ సౌతాల్ ప్రజలకు సేవ చేయడమే” అంటూ ది టెలిగ్రాఫ్ తో మాట్లాడాడు. అయితే పనేసర్ పోటీ చేసే నియోజకవర్గం 2007 నుంచి వివేంద్ర శర్మ ఆధ్వర్యంలో లేబర్ పార్టీకి కంచుకోటగా ఉంది. ఈ నియోజక వర్గంలో దాదాపు మూడింట ఒక వంతు ఆసియన్ జనాభా ఉన్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి