iDreamPost

మాజీ సీఎంకు క‌రోనా : ఆస్ప‌త్రిలో బెడ్ క‌రువు

మాజీ సీఎంకు క‌రోనా : ఆస్ప‌త్రిలో బెడ్ క‌రువు

క‌రోనా సెకండ్ వేవ్ దేశంలో క‌ల్లోలం రేపుతోంది. అన్ని రంగాల‌నూ మ‌రోసారి కుదిపేస్తోంది. పాజిటివిటీ రేటు రోజురోజుకూ పెరుగుతోంది. సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కూ పారిశ్రామిక వేత్త‌ల నుంచి పొలిటిక‌ల్ లీట‌ర్ల వ‌ర‌కూ ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇప్పటికే యూపీ సీఎం ఆదిత్యనాధ్, కేరళ సీఎం పినరాయి విజయన్‌తో సహా పలువురు పొలిటికల్ లీడర్స్‌కు కరోనా పాజిటివ్ తేలగా.. నిన్న ఆ లిస్టులోకి కర్ణాటక సీఎం యడ్యూరప్ప కూడా చేరారు. ఇటీవల ఆయన కరోనా టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ నిర్ధారణ అయింది. మెరుగైన చికిత్స నిమిత్తం ఆయనను రామయ్య మెమోరియల్ హాస్పిటల్‌ నుంచి మణిపాల్ హాస్పిటల్‌కు తరలిస్తున్నట్లు కర్ణాటక సీఎంవో ట్విట్టర్ వేదికగా పేర్కొంది.

తాజాగా న‌టుడు సోనూసూద్ కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. పెరుగుతున్న కేసుల‌తో ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోతున్నాయి. సామాన్యులకు అస్సలే ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకడం లేదు. డబ్బుండి పరపతి ఉన్న వారికి రికమండేషన్ పై బెడ్స్ దొరుకుతున్న పరిస్థితి. అయితే తాజాగా ఓ మాజీ సీఎంకు కూడా ఆస్పత్రిలో బెడ్స్ దొరకని పరిస్థితి నెలకొందంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తాజాగా కరోనా బారినపడ్డారు. మొన్నటిదాకా కర్ణాటక సీఎంగా చక్రంతిప్పిన ఆయనకు అదే రాష్ట్రంలో ఒక్క ఆస్పత్రిలో బెడ్ దొరకని దుస్థితి నెలకొంది. ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. ప్రస్తుత వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి ఫోన్ చేసి బెడ్ ఇప్పించాలని కోరినప్పటికీ ఫలితం మాత్రం కానరాలేదని కుమారస్వామి ట్వీట్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కల్లోలం చోటుచేసుకుంది. మాజీ సీఎంకే బెడ్ దొరకనంత రద్దీగా ఆస్పత్రులన్నీ మారిపోయాయి.

కొద్దిరోజులుగా ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కుమారస్వామికి కరోనా సోకింది. అయితే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఇంటికి వెళ్లకుండా హోటల్ లో ఉంటున్నారు. తాజాగా మణిపాల్ ఆస్పత్రిలో బెడ్ కోసం సంప్రదించారు. అయితే బెడ్స్ ఖాళీగా లేవని వాళ్లు తెలిపారు. మ‌హారాష్ట్ర, క‌ర్ణాట‌క దీంతో వెంటనే కర్ణాటక రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ కు ఫోన్ చేసి బెడ్ ను ఇప్పించాలని కోరారు. అయినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమంగా ఉండడంతో బన్నెర్ ఘట్టా రోడ్ లోని మరో ప్రైవేటు ఆస్పత్రిలో చేరాలని డిసైడ్ అయ్యారట‌. ఇలా కన్నడనాట మాజీ సీఎంల స్థాయి వ్యక్తులకు కూడా బెడ్స్ దొరకని విధంగా కరోనా విలయతాండవం చేస్తోంది.

Also Read : కరోనా సెకండ్ వేవ్ : ఏపీలోనే సేఫ్ అని ఎందుకు భావిస్తున్నారు..?

దేశ వ్యాప్తంగా క‌రోనా ఉధృతికి ఈ ఉదంతం నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. వ‌రుస‌గా జ‌రుగుతున్న ఎన్నిక‌లు, ఉప ఎన్నిక‌ల‌తో ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు క‌రోనా బారిన ప‌డుతున్నాను. మ‌హారాష్ట్ర, క‌ర్ణాట‌క రాష్ట్రాల‌లో వైర‌స్ మ‌రింత ఎక్కువ‌గా విల‌య‌తాండవం చేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి