iDreamPost

తారక్ కి వరుసకు రామ్ ఏమవుతాడో తెలుసా? ఇద్దరూ బంధువులే!

  • Published May 01, 2024 | 7:19 PMUpdated May 01, 2024 | 7:19 PM

తారక్ గురించి అంతగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం అందరు తారక్ నటిస్తున్న దేవర చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటపడింది. అదేంటో చూసేద్దాం.

తారక్ గురించి అంతగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం అందరు తారక్ నటిస్తున్న దేవర చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటపడింది. అదేంటో చూసేద్దాం.

  • Published May 01, 2024 | 7:19 PMUpdated May 01, 2024 | 7:19 PM
తారక్ కి వరుసకు రామ్ ఏమవుతాడో తెలుసా? ఇద్దరూ బంధువులే!

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో తన సత్తా ఏంటో చూపించి.. ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు తారక్. ఇంకా ఇప్పుడు అందరి ఎదురుచూపులు తారక్ నటిస్తున్న వార్, దేవర చిత్రాల మీదే ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు వస్తున్న క్రమంలో.. తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఇండస్ట్రీలో ఒకరికి ఒకరు బంధుత్వాలు ఉంటూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో ఓ స్టార్ హీరో తారక్ కు బంధువట. ఎవరో చూసేద్దాం.

ఆ హీరో మరెవరో కాదు.. రామ్ పోతినేని. అవును రామ్ పోతినేని , తారక్ బంధువులు అవతారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. అది నిజమే. వీరిద్దరూ బంధువులే. ఇదే విషయాన్నీ స్వయంగా ఓసారి రామ్ ఒకానొక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఓ వేదికపైన రామ్ మాట్లాడుతూ తనకు తారక్ వరుసకు అన్నయ్య అవుతాడు అంటూ చెప్పుకొచ్చాడు. అప్పట్లో దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో షికార్లు చేసింది. కానీ వీరిద్దరూ మాత్రం ఎక్కడా కలిసి కనిపించలేదు. వీరి అభిమానులు మాత్రం దీని గురించి డిస్కషన్స్ జరిపే పనిలోనే ఉన్నారు.

ఇక తారక్ సినిమాల విషయానికొస్తే అక్టోబర్ 10 న రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ దద్దరిల్లబోతున్నాయి. దేవర సినిమా మొదటి పార్ట్ ఈ ఏడాది అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుందన్న విషయాన్నీ.. ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ పనులు ఆఖరి దశకు చేరుకున్నాయి. ఆ పనులను పూర్తి చేసుకుని.. వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టనున్నారు కొరటాల శివ. రామ్ కూడా ఇస్మార్ట్ శంకర్ పార్ట్ -2 లో బిజీగా ఉన్నాడు. ఇక తారక్ ను స్క్రీన్ మీద చూసి చాలా రోజులు గడిచిపోయింది కాబట్టి.. తారక్ అభిమానులంతా దేవర రిలీజ్ డేట్ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మరి తారక్ , రామ్ పోతినేని బంధువులని వినిపిస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి