iDreamPost

OTT Suggestion: ఏకంగా 14 భాషల్లో రిలీజ్ అయిన ఈ హిస్టారికల్ సిరీస్ ను అసలు మిస్ కాకండి!

  • Published May 02, 2024 | 8:19 AMUpdated May 02, 2024 | 8:19 AM

మూవీ లవర్స్ అంతా ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్న సిరీస్ ఓటీటీ లకి రానే వచ్చింది. ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాల్సిన సిరీస్ ఇది. మరి ఈ సిరీస్ టాక్ ఎలా ఉందో చూసేద్దాం. ఈ సిరీస్ ఏంటో చూసేద్దాం.

మూవీ లవర్స్ అంతా ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్న సిరీస్ ఓటీటీ లకి రానే వచ్చింది. ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాల్సిన సిరీస్ ఇది. మరి ఈ సిరీస్ టాక్ ఎలా ఉందో చూసేద్దాం. ఈ సిరీస్ ఏంటో చూసేద్దాం.

  • Published May 02, 2024 | 8:19 AMUpdated May 02, 2024 | 8:19 AM
OTT Suggestion: ఏకంగా 14 భాషల్లో రిలీజ్ అయిన ఈ హిస్టారికల్ సిరీస్ ను అసలు మిస్ కాకండి!

ప్రతి శుక్రవారం ఓటీటీ లోకి ఎన్నో సినిమాలు , సిరీస్ లు వస్తాయన్న సంగతి తెలిసిందే. దీనితో ప్రతివారం మూవీ లవర్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది. కానీ ఈ వారం మాత్రం ఆ ఎంటర్టైన్మెంట్ కాస్త ముందుగా మొదలైపోయింది. ఎందుకంటే ఈ వారం అందరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యి మంచి టాక్ సంపాదించుకుంటుంది, పైగా ఈ సిరీస్ ఏకంగా 14 భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. పైగా ఈ వెబ్ సిరీస్ కు ఓ పెద్ద సినిమాకు పెట్టినంత బడ్జెట్ ను కేటాయించారట. దీనితో ఈ వెబ్ సిరీస్ ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని అందరు కొన్ని నెలలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆ రోజు రానే వచ్చింది. మరి ఇంతకీ ఆ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది.. టాక్ ఎలా ఉందొ చూసేద్దాం.

ఆ సిరీస్ మరేదో కాదు.. బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలీ డైరెక్ట్ చేసిన.. “హీరామండి : ది డైమండ్ బజార్”. మే 1 నుంచి ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన కథ ఇది. భారతదేశం బ్రిటిష్ పరిపాలనలో ఉన్న కాలంలో .. అంటే 1940ల కాలం బ్యాక్డ్రాప్ తో ఈ సిరీస్ ను రూపొందించారు. హీరామండీ అనే రెడ్ లైట్ ప్రాంతంలో.. జీవనం సాగించే కొంతమంది డ్యాన్సర్స్ జీవితాల గురించి.. ఈ సిరీస్ లో చూపించారు. ఆ కాలంలో మహిళలు ఎదుర్కున్న ఎన్నో సమస్యలను.. ఈ సిరీస్ లో కళ్ళకు కట్టినట్లు చూపించడం జరిగింది. తెలుగుతో పాటు ఈ సిరీస్ ఇంకా 13 భాషల్లో అందుబాటులో ఉంది. కాబట్టి వెంటనే అందరూ చూసేయండి. కచ్చితంగా ఇది ఒక వర్త్ వాచింగ్ సిరీస్ అవుతోందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, ఆదితి రావ్ హైదరి, సంజీదా షేక్, షార్మీన్ సేగల్ ఈ భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలు పోషించారు . హీరమండి వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు ఎంత ఈగర్ గా అయితే వెయిట్ చేశారో.. అదే రేంజ్ లో రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సిరీస్ లోని ప్రతి క్యారెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందంటూ.. సిరీస్ మొత్తం కూడా ఎక్కడ బోర్ కొట్టించకుండా ఉందంటూ.. సంజయ్ లీల భన్సాలీ సినిమాలలో తన మార్క్ ఎలా అయితే చుపించారో.. ఈ సిరీస్ లో కూడా ఎక్కడా దానిని తగ్గనివ్వకుండా చుపించారంటూ చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి వెంటనే ఈ సిరీస్ ను చూసేయండి, మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి