కరోనాతో పోరాడి గెలిచాక కూడా నిన్న రాత్రి 8 గంటలకు తుది శ్వాస తీసుకున్న శివ శంకర్ మాస్టర్ జ్ఞాపకాలతో యావత్ సినిమా ప్రపంచం శోకంలో మునిగిపోయింది. కొనఊపిరి వరకు డాన్సు తప్ప మరో ఊసు లేకుండా గడిపిన ధన్య జీవి ఆయన. 72 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మొదలుకుని ఇప్పటి చరణ్ మహేష్ దాకా అందరూ ఆయన కంపోజింగ్ తో వెండితెరమీద అద్భుతాలు చేసినవాళ్ళే. నృత్య దర్శకుడిగానే కాదు డాన్స్ రియాలిటీ షోలలో జడ్జ్ […]
సుప్రసిద్ధ డాన్స్ మాస్టర్ సుందరం వారసుడిగా కంటే తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలితో అశేష అభిమానులను సంపాదించుకున్న ప్రభుదేవా తర్వాత కాలంలో కొరియోగ్రాఫర్ గానూ హీరోగానూ రెండు పడవల ప్రయాణాన్ని సమర్ధవంతంగా నడిపించాడు. ప్రేమికుడు వచ్చాక దశతిరిగి పోయి లెక్కలేనన్ని సినిమాల్లో కథానాయకుడిగా మెప్పించాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానాతో దర్శకుడిగా లైఫ్ ఇచ్చింది కూడా టాలీవుడ్డే. తర్వాత పౌర్ణమి భారీ అంచనాల మధ్య ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇక చిరంజీవితో చేసిన లగే రహో మున్నాభాయ్ రీమేక్ శంకర్ […]