iDreamPost
android-app
ios-app

14 ఏళ్ళ తర్వాత దర్శకుడిగా ఛాన్స్

  • Published Aug 05, 2021 | 10:04 AM Updated Updated Aug 05, 2021 | 10:04 AM
14 ఏళ్ళ  తర్వాత దర్శకుడిగా ఛాన్స్

సుప్రసిద్ధ డాన్స్ మాస్టర్ సుందరం వారసుడిగా కంటే తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలితో అశేష అభిమానులను సంపాదించుకున్న ప్రభుదేవా తర్వాత కాలంలో కొరియోగ్రాఫర్ గానూ హీరోగానూ రెండు పడవల ప్రయాణాన్ని సమర్ధవంతంగా నడిపించాడు. ప్రేమికుడు వచ్చాక దశతిరిగి పోయి లెక్కలేనన్ని సినిమాల్లో కథానాయకుడిగా మెప్పించాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానాతో దర్శకుడిగా లైఫ్ ఇచ్చింది కూడా టాలీవుడ్డే. తర్వాత పౌర్ణమి భారీ అంచనాల మధ్య ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇక చిరంజీవితో చేసిన లగే రహో మున్నాభాయ్ రీమేక్ శంకర్ దాదా జిందాబాద్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది

ఇక లేటెస్ట్ అప్ డేట్ విషయానికి వస్తే ప్రభుదేవా మళ్ళీ తెలుగుకి వచ్చే ప్రయత్నాలు పెంచారట. ఇటీవలే సల్మాన్ ఖాన్ తో రాధే లాంటి డిజాస్టర్ ఇచ్చిన తరుణంలో ఇతని మీద క్రిటిక్స్ మాములుగా విరుచుకుపడలేదు. ఇంత రొటీన్ చెత్త సినిమా ఈ మధ్య కాలంలో చూడలేదని క్లాసులు తీసుకున్నారు. దీనికి కన్నా ముందు తీసిన దబాంగ్ 2, సింగ్ ఈజ్ బ్లింగ్, యాక్షన్ జాక్సన్, ఆర్ రాజ్ కుమార్, రామయ్య వస్తావయ్యా అన్నీ ఫ్లాపులే. విక్రమార్కుడు రీమేక్ రౌడీ రాథోడ్ ఒక్కటే కమర్షియల్ గా సక్సెస్ అందుకుంది. అంతకు ముందు సల్మాన్ తో చేసిన పోకిరి రీమేక్ వాంటెడ్ కూడా లాభాలు ఇచ్చింది.

ఇంత బ్యాడ్ ట్రాక్ రికార్డు ఉన్న ప్రభుదేవా ఇప్పుడు చిరంజీవితో మరో సినిమా చేసేందుకు ట్రై చేస్తున్నారట. ఈ మద్యే ఒక లైన్ చెబితే అది మెగాస్టార్ కు నచ్చడం ఫుల్ వెర్షన్ విన్నాక నిర్ణయం తీసుకుందామని చెప్పడం జరిగిందని మెగా కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న మాట. ఇది నిజమైతే మాత్రం అభిమానులకు షాకే. అసలే మెహర్ రమేష్ తో చేస్తున్న ప్రాజెక్ట్ మీదే వాళ్లకు సవాలక్ష సందేహాలు ఉన్నాయి. బాబీ కూడా టాప్ ఫామ్ లో ఉన్న దర్శకుడు కాదు. మోహన్ రాజా సంగతి సరేసరి. అదే పనిగా చిరంజీవి ఇలా డైరెక్టర్ సెలక్షన్ లో తీసుకుంటున్న నిర్ణయాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూడాలి

Also Read : 400 స్క్రీన్లతో భారీ టార్గెట్ పెట్టుకున్న SR