iDreamPost
android-app
ios-app

దేవరలో తారక్ డ్యాన్స్ అరాచకం! కొరియోగ్రాఫర్ కామెంట్స్ తో ఫ్యాన్స్ కి పూనకాలు!

  • Published Jul 23, 2024 | 6:38 PM Updated Updated Jul 23, 2024 | 6:38 PM

ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నా విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమా షూటింగ్ దాదాపు చివర దశలోకి వచ్చేసింది. అయితే తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పై ప్రముఖ కోరియాగ్రాఫర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నా విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమా షూటింగ్ దాదాపు చివర దశలోకి వచ్చేసింది. అయితే తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పై ప్రముఖ కోరియాగ్రాఫర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

  • Published Jul 23, 2024 | 6:38 PMUpdated Jul 23, 2024 | 6:38 PM
దేవరలో తారక్ డ్యాన్స్ అరాచకం! కొరియోగ్రాఫర్ కామెంట్స్ తో ఫ్యాన్స్ కి పూనకాలు!

ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదరుచూస్తున్న సినిమా ‘దేవర’. ఈ సినిమాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఇందులోజాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ రెండు భాగులుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.కాగా, ఈ ఫ్రాంచైజీ మూవీని సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణలతో కలిసి నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం దేవర తొలి పార్ట్ షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. అంతేకాకుండా.. ఈ సినిమా సెప్టెంబరు 27న ప్రేక్షకుల ముందుకురానున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఎన్టీఆర్ పై ప్రముఖ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ప్రశంసిస్తూ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 షూటింగ్ తో బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడెప్పుడు తమ అభిమాన నటుడి సినిమా థియేటర్లలో విడుదల అవుతుందనని ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఈ సినిమాకు సంబంధించి ఏ అప్ డేట్ వస్తుందానని చాలా అలర్ట్ గా ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఎన్టీఆర్ పై ప్రముఖ కొరియోగ్రాఫర్‌ బాస్కో మార్టిస్‌ ప్రశంసలు కురిపించారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కొరియోగ్రాఫర్‌ బాస్కో మార్టిస్‌ కు ఎదురైన ప్రశ్నకు సమాధానమిస్తూ తారక్ ను కొనియడారు. ఈ సందర్భంగా బాస్కో మార్టిస్‌  మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎన్టీఆర్ అద్భుతమైన డ్యాన్సర్‌. ఇక దేవర సినిమాలో ఓ పాటకు నేను కొరియోగ్రాఫి కూడా చేశాను. అయితే అందులో క్లిష్టమైన స్టెప్పుల్లేవు,  చాలా సింపుల్‌గా కంపోజ్‌ చేశాను. ఇక ఎన్టీఆర్‌ స్వీట్‌ డ్యాన్స్‌ అదిరిపోతుంది. దేవరలో మీరంతా ఆయన డ్యాన్స్ ను తప్పక ఎంజాయ్‌ చేస్తారు’ అంటూ బాస్కో మార్టిస్‌ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించారు.

ఇకపోతే కొరియోగ్రాఫర్‌ బాస్కో మార్టిస్‌  తెలుగులో ‘శ్రీమంతుడు’, ‘ధ్రువ’ తదితర చిత్రాల్లోని పాటలకు కొరియోగ్రఫీ చేశారు. దీంతో పాటు  ‘రాకెట్‌ గ్యాంగ్‌’ చిత్రంతో బాస్కో దర్శకుడిగా  మారారు. ఇటీవల విడుదలై నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచిన విక్కి కౌశల్  ‘తోబా తోబా’ (బ్యాడ్‌ న్యూజ్‌) సాంగ్‌ కూడా  బాస్కో కొరియోగ్రఫీ చేశారు. ఇక  చాలాకాలం తర్వాత తెలుగులో మళ్లీ ‘దేవర’కు వర్క్‌ చేశారు. త్వరలోనే ఆ పాట రిలీజ్‌ కానుంది. మరి, కొరియోగ్రాఫర్‌ బాస్కో మార్టిస్‌ ఎన్టీఆర్ ను ప్రశంసిస్తూ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler