గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న అక్కినేని నాగార్జునకు ది ఘోస్ట్ ఇచ్చిన షాక్ చిన్నది కాదు. కష్టపడి యాక్షన్ లు స్టంట్లు గట్రా చేస్తే ఆడియన్స్ నుంచి తిరస్కారమే ఎదురయ్యింది. అంతకు ముంచు బంగార్రాజు హిట్టనిపించుకున్నా అందులో చైతు ఉన్నాడు కాబట్టి పూర్తిగా కింగ్ కే క్రెడిట్ ఇవ్వలేం. ఇక వైల్డ్ డాగ్ చేసిన గాయం ఇంకా పచ్చిగానే ఉంది. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 6 ఆశించిన స్థాయిలో విజయవంతం […]