iDreamPost
android-app
ios-app

ఈ కొంటె పిల్ల వైల్డ్ కార్డ్ ఎంట్రీ ?.. హౌస్ లో డబుల్ మజా !

  • Published Sep 09, 2025 | 12:20 PM Updated Updated Sep 09, 2025 | 12:20 PM

తెలుగు ఆడియన్స్ ను మూడు నెలల పాటు టివిలకు కట్టిపడేసే రియాలిటీ షో బిగ్ బాస్. అదేంటో తెలియదు కానీ ఈ షో మీద ఇంట్రెస్ట్ లేనోళ్ళు కూడా ఎదో ఒక టైం లో ఇంట్రెస్టింగ్ గానే చూస్తూ ఉంటారు. ఆ రేంజ్ లో బిగ్ బాస్ ప్రేక్షకులను అలరించడం మొదలు పెట్టింది.

తెలుగు ఆడియన్స్ ను మూడు నెలల పాటు టివిలకు కట్టిపడేసే రియాలిటీ షో బిగ్ బాస్. అదేంటో తెలియదు కానీ ఈ షో మీద ఇంట్రెస్ట్ లేనోళ్ళు కూడా ఎదో ఒక టైం లో ఇంట్రెస్టింగ్ గానే చూస్తూ ఉంటారు. ఆ రేంజ్ లో బిగ్ బాస్ ప్రేక్షకులను అలరించడం మొదలు పెట్టింది.

  • Published Sep 09, 2025 | 12:20 PMUpdated Sep 09, 2025 | 12:20 PM
ఈ కొంటె పిల్ల వైల్డ్ కార్డ్ ఎంట్రీ ?.. హౌస్ లో డబుల్ మజా !

తెలుగు ఆడియన్స్ ను మూడు నెలల పాటు టివిలకు కట్టిపడేసే రియాలిటీ షో బిగ్ బాస్. అదేంటో తెలియదు కానీ ఈ షో మీద ఇంట్రెస్ట్ లేనోళ్ళు కూడా ఎదో ఒక టైం లో ఇంట్రెస్టింగ్ గానే చూస్తూ ఉంటారు. ఆ రేంజ్ లో బిగ్ బాస్ ప్రేక్షకులను అలరించడం మొదలు పెట్టింది. ఇక ఈసారి డబుల్ హౌస్ డబుల్ డోస్ తో.. సెలెబ్రిటీలు , కామనర్స్ మధ్య పోటీ మొదలైపోయింది. ఎప్పుడెప్పుడు షో లో ఎలాంటి టర్నింగ్ పాయింట్స్ మొదలవుతాయ అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు.

అయితే షో స్టార్ట్ అయ్యే ముందు వరకు వినిపించిన ప్రెడిక్షన్స్ లో కొన్ని మాత్రమే నిజం అయ్యాయి. గెస్ చేసిన సెలెబ్రిటీస్ లిస్ట్ లో కొంతమంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు అయితే ఇది ఇక్కడితో అయిపోలేదు. గేమ్ స్టార్ట్ అయినా నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత హౌస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఉంటాయి. ఇప్పటివరకు బిగ్ బాస్ హిస్టరీలో ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చిన వాళ్లంతా హౌస్ లో డబుల్ మజాని నింపారు. ఇక ఇప్పుడు సీజన్ 9 అసలు డబుల్ డోస్ అన్నారు.. సో అంతకుమించిన మజా ఉండాలి. అలా ఉండాలంటే హౌస్ లో సందడి చేసే గ్లామర్ ఉండాలి. అందుకే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లిస్ట్ లో సీరియల్ యాక్టర్ కావ్య పేరు వినిపిస్తుంది.

ఈ అమ్మడు టీవీ షోస్ లో చేసే అల్లరి పనులు అందరికి పరిచయమే. కావ్యకు తెలుగు అంత రాకపోయినా ఫన్ జెనెరేట్ చేస్తూనే ఉంటుంది. సో ఇలాంటి అమ్మాయ్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిందంటే ఇక డబుల్ మజా కన్ఫర్మ్. ప్రస్తుతానికైతే కావ్య పేరు మాత్రమే వినిపిస్తుంది. ముందు ముందు షో టిఆర్పి , రేటింగ్స్ ను బట్టి మేకర్స్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Deepika Rangaraju (@deepika_rangaraju)