Swetha
BB9 Telugu Updates: బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారమే కంటెన్స్టెంట్స్ అంతా పోటా పోటీగా గేమ్ ఆడడం మొదలుపెట్టారు. కొందరు బాగానే కలిసిపోయారు. మరికొందరు ఇంకా మాస్క్ తీయలేదని అనిపిస్తుంది. ఇక అందరి మాస్క్ లు తీస్తానంటూ వెళ్లిన మాస్క్ మ్యాన్ నోరు జారిన సందర్భాలు లేకపోలేదు. టెనెంట్స్ ఓనర్స్ మధ్యన కాసేపు గొడవపడుతున్నారు.. కాసేపు సరదాగా నవ్విస్తున్నారు.
BB9 Telugu Updates: బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారమే కంటెన్స్టెంట్స్ అంతా పోటా పోటీగా గేమ్ ఆడడం మొదలుపెట్టారు. కొందరు బాగానే కలిసిపోయారు. మరికొందరు ఇంకా మాస్క్ తీయలేదని అనిపిస్తుంది. ఇక అందరి మాస్క్ లు తీస్తానంటూ వెళ్లిన మాస్క్ మ్యాన్ నోరు జారిన సందర్భాలు లేకపోలేదు. టెనెంట్స్ ఓనర్స్ మధ్యన కాసేపు గొడవపడుతున్నారు.. కాసేపు సరదాగా నవ్విస్తున్నారు.
Swetha
బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారమే కంటెన్స్టెంట్స్ అంతా పోటా పోటీగా గేమ్ ఆడడం మొదలుపెట్టారు. కొందరు బాగానే కలిసిపోయారు. మరికొందరు ఇంకా మాస్క్ తీయలేదని అనిపిస్తుంది. ఇక అందరి మాస్క్ లు తీస్తానంటూ వెళ్లిన మాస్క్ మ్యాన్ నోరు జారిన సందర్భాలు లేకపోలేదు. టెనెంట్స్ ఓనర్స్ మధ్యన కాసేపు గొడవపడుతున్నారు.. కాసేపు సరదాగా నవ్విస్తున్నారు. టాక్స్ లు కూడా అంతే జోష్ లో ఆడుతున్నారు. ఇక ఈ వీక్ నామినేషన్స్ లో కామనర్స్ నుంచి డీమన్ పవన్, సెలెబ్రిటీల నుంచి సంజన గల్రానీ, ఫ్లోరా సైనీ, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, శ్రష్టి వర్మ, రాము రాథోడ్, తనూజ, ఇమ్మాన్యుయేల్ ఉన్నారు.
సో నార్మల్ వాళ్ళ కంటే కూడా నామినేషన్స్ లో ఉన్న వాళ్ళు కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వీళ్ళలో దాదాపు అంతా బానే ఎంటర్టైన్ చేస్తున్నారు. ఫుటేజ్ గా తగిన కంటెంట్ ఇస్తున్నారు. కానీ డిమాన్ పవన్ , ఫ్లోరా సైని , శ్రష్టి వర్మ , సుమన్ శెట్టి మాత్రం అందరికంటే కాస్త డల్ గా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సోషల్ మీడియా పోల్స్ ప్రకారం సుమన్ శెట్టికి కూడా బానే ఓట్స్ పడుతున్నాయట. అలాగే డిమాన్ పవన్ ఆల్రెడీ ఆడియన్స్ ఓట్స్ బేస్డ్ ఏ లోనికి వెళ్ళాడు కాబట్టి అతనికి కూడా ఈ వారం పెద్ద డేంజర్ లేదు. కొంతకాలం హౌస్ లో ఉండే ఛాన్స్ కూడా లేకపోలేదు.
ఇక మిగిలింది శ్రష్టి, ఫ్లోరా సైనీ. ఈ నాలుగైదు రోజుల ఎపిసోడ్స్ లో హౌస్ లో వీరిద్దరి ఇన్వల్వెమెంట్ పెద్దగా కనిపించలేదు. ఫ్లోరా అయితే సజనతో గొడవ అయినప్పటినుంచి దానినే ఇంకా క్యారీ చేస్తూ కనిపిస్తుంది. ఎక్కువగా వాషింగ్ ఏరియా దగ్గరే గడుపుతుంది. ఇక శ్రష్టి విషయానికొస్తే ఆమె నుంచి పోజిటివ్ లేదు నెగిటివ్ లేదు.. సో ఆడియన్స్ కూడా ఓ క్లారిటీ లేకుండా పోయింది. సో ప్రస్తుతానికి ఈ ఇద్దరు డేంజర్ లో ఉన్నట్లే. ఇక ఈ వీకెండ్ నాగ్ వీరికి ఎలాంటి క్లాస్ తీసుకుంటారో హౌస్ లో నుంచి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.