iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ 8 నామినేషన్ లో కుక్కర్ పంచాయితీ.. ఆ ఇద్దరిపైనే అందరి ఫోకస్

  • Published Sep 03, 2024 | 1:40 PM Updated Updated Sep 03, 2024 | 1:40 PM

Telugu Bigg Boss 8 Day2 Latest Update: బుల్లి తెర రియాలిటీ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 మొదలైందన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ గేమ్ లో నిన్నటినుంచి అసలు ఆట మొదలైంది. నామినేషన్స్ రచ్చ కూడా మొదలపోయింది. వారిలో ఇద్దరినీ మాత్రం బాగా టార్గెట్ చేసినట్లు చూపిస్తున్నారు. పూర్తి విషయాలు చూసేద్దాం.

Telugu Bigg Boss 8 Day2 Latest Update: బుల్లి తెర రియాలిటీ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 మొదలైందన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ గేమ్ లో నిన్నటినుంచి అసలు ఆట మొదలైంది. నామినేషన్స్ రచ్చ కూడా మొదలపోయింది. వారిలో ఇద్దరినీ మాత్రం బాగా టార్గెట్ చేసినట్లు చూపిస్తున్నారు. పూర్తి విషయాలు చూసేద్దాం.

  • Published Sep 03, 2024 | 1:40 PMUpdated Sep 03, 2024 | 1:40 PM
బిగ్ బాస్ 8 నామినేషన్ లో కుక్కర్ పంచాయితీ.. ఆ ఇద్దరిపైనే అందరి ఫోకస్

బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు.. ఈసారి అంతా లిమిట్ లెస్ అంటూ స్టార్ట్ చేసిన ఈ షో లో.. నిన్నటి నుంచి అసలు కథ మొదలైంది. అప్పుడే హౌస్ మేట్స్ మధ్యన గొడవలు , వాదోపవాదాలు , ఒకరి గురించి మరొకరు డిస్కషన్స్ అన్ని మొదలైపోయాయి. దీనితో ప్రేక్షకులకు కూడా కాస్త క్యూరియాసిటీ పెరుగుతుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఈసారి కెప్టెన్ ఎవరు ఉండరని.. చీఫ్ ఉంటారని తేల్చేసి… హౌస్ మేట్స్ కు కొన్ని గేమ్స్ పెట్టారు. దానిలో నిఖిల్ , యష్మి, నైనిక చీఫ్స్ గా సెలెక్ట్ అయ్యారు. ఇక ఆ తర్వాత నామినేషన్స్ ప్రక్రియ కూడా మొదలైంది. అది ఈరోజు ప్రసారం కానుంది. ఇక విచిత్రంగా ఆ నామినేషన్స్ లో కుక్కర్ పంచాయితీ జరిగింది.

షో స్టార్ట్ అయినా రెండు రోజుల్లోనే హౌస్ లో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ మొదలైపోయాయి. ఆల్రెడీ సోషల్ మీడియాలో హౌస్ లో జరిగిన అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి కూడా.. .. ఇక సోమవారం జరిగిన గొడవల్లో సోనియా , బెబెక్క మధ్య కుక్కర్ పంచాయితీ నడిచింది. కిచెన్ లో అజాగ్రత్తగా ఉన్నారనే రీజన్ తో… సోనియా.. బేబక్కని నామినేట్ చేసింది. దీనితో బేబక్క.. కుక్కర్ లోపల ప్రెజర్ ఉంటుంది.. అది దిగే వరకు మనం ఆగాలి అంటూ సమాధానం ఇచ్చింది. మరి ఆమె కేవలం కుక్కర్ నే ఉద్దేశించి అందో.. లేదా నామినేషన్ ప్రక్రియలో ఇంకెవరినైనా ఉద్దేశించి అందో.. తెలియదు కానీ.. ఈరోజు నామినేషన్స్ లో మాత్రం ఈ టాపిక్ ఏ హైలెట్ అయ్యేలా ఉంది. మరి ఏమౌతుందో చూడాలి.

ఇక మరో వైపు మణికంఠ శేఖర్ పాషాని నామినేట్ చేయడంతో .. వారిద్దరి మధ్య కూడా మాటల యుద్ధం మొదలైంది. ఇక ఈరోజు రిలీజ్ అయినా ప్రోమోను గమనిస్తే హౌస్ మేట్స్ అందరిలో మణికంఠ , బేబక్క ఇద్దరు బాగా టార్గెట్ అయినట్లు అనిపిస్తుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎప్పుడు.. దేని గురించి గొడవ పడతారో ఎవరికీ అర్థంకాదు. ఇది అందరికి తెలిసిన విషయమే.. రెండు రోజుల్లోనే ఇలా ఉంటె ఇక.. ముందు ముందు ఎలాంటి పంచాయితీలు ఉంటాయో చూడాలి. ఈ వారం ఎవరో నామినేట్ అవుతున్నారో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet