గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న అక్కినేని నాగార్జునకు ది ఘోస్ట్ ఇచ్చిన షాక్ చిన్నది కాదు. కష్టపడి యాక్షన్ లు స్టంట్లు గట్రా చేస్తే ఆడియన్స్ నుంచి తిరస్కారమే ఎదురయ్యింది. అంతకు ముంచు బంగార్రాజు హిట్టనిపించుకున్నా అందులో చైతు ఉన్నాడు కాబట్టి పూర్తిగా కింగ్ కే క్రెడిట్ ఇవ్వలేం. ఇక వైల్డ్ డాగ్ చేసిన గాయం ఇంకా పచ్చిగానే ఉంది. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 6 ఆశించిన స్థాయిలో విజయవంతం […]
టీవీ రియాలిటీ షోలలో కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన బిగ్ బాస్ మొదటి రెండు మూడు సీజన్లతో పోల్చుకుంటే ఇప్పుడు జరుగుతున్న ఆరో సిరీస్ నీరసంగా సాగుతోంది. నాగార్జునకు బాక్సాఫీస్ వద్ద ది ఘోస్ట్ షాక్ ఇవ్వగా ఇప్పుడీ గేమ్ కు వస్తున్న స్పందన నిరాశ కలిగించేదే. మొదలుపెట్టి నెల రోజులు దాటినా ఆడియన్స్ పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా పార్టిసిపెంట్స్ విషయంలో నిర్వాహకులు తీసుకున్న నిర్ణయాలు రీచ్ ని బాగా దెబ్బ తీశాయి. […]
బిగ్బాస్-6 సందడి కాసేపట్లో ప్రారంభం కానుంది. సీజన్-3 నుంచి హోస్ట్గా వ్యవహరించిన నాగార్జుననే ఈ సీజన్కు కూడా హోస్ట్. ఈసారి బిగ్ బాస్ మీద మంచి బజ్ వచ్చింది. ఇప్పటికే సోషల్ మీడియాలో బిగ్బాస్ సందడి పీక్ కి వెళ్లింది. ఇంతకీ కంటెస్టెంట్స్ ఎవరు? షోలో పాల్గొనబోతున్న కంటెస్టెంట్లు వీళ్లేనంటూ ఓ లిస్ట్ తెగ షేర్ అవుతోంది. అందులో కొందరు ప్రొమోలోనే కనిపించారు. 20మంది పేర్లు బయటికి వచ్చాయి. ఇదే ఫైనల్ లిస్ట్ అని, అందులో గీతూ […]
బుల్లితెరపై ‘బిగ్బాస్’ ఆరో సీజన్ మొదలవునుంది. తాజాగా ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. ఎప్పుడూ గ్లామరస్ గా మొదలైయ్యే ప్రోమో, ఈసారి అప్పగింతలప్పుడు పెళ్లికూతురు కంటతడి పెట్టుకోవడంతో ఆరంభమైంది. మా ఇంటి మహాలక్ష్మిని పంపించడం నా వల్ల కావట్లేదమ్మా అంటూ పేరెంట్స్ ఎమోషన్స్ , పెళ్లి కూతురు వారిని ఓదారుస్తున్న వేళ ఒక్కసారిగా మాయమవుతారు. వాళ్లకోసం పెళ్లి కూతురు వెతుకుతుంటే నాగార్జున ఎంట్రీ ఇచ్చి ‘అప్పగింతలు అయ్యే వరకు కూడా ఆగలేకపోయారంటే, అక్కడ ఆట మొదలైనట్టే’అని బిగ్బాస్ […]