iDreamPost
android-app
ios-app

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ బ్యూటీ

  • Published Feb 21, 2024 | 8:43 AM Updated Updated Feb 21, 2024 | 8:43 AM

బుల్లి తెరపై పలు సీరియల్స్ లో నటించి, ఆ తర్వాత యాంకర్ గా ఫేమ్ తెచ్చుకుంది వాసంతి కృష్ణన్. ఈమె బిగ్ బాస్ 6 లో సందడి చేసింది. తాజాగా ఆమె తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

బుల్లి తెరపై పలు సీరియల్స్ లో నటించి, ఆ తర్వాత యాంకర్ గా ఫేమ్ తెచ్చుకుంది వాసంతి కృష్ణన్. ఈమె బిగ్ బాస్ 6 లో సందడి చేసింది. తాజాగా ఆమె తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

  • Published Feb 21, 2024 | 8:43 AMUpdated Feb 21, 2024 | 8:43 AM
వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ బ్యూటీ

సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు తమ బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పేస్తున్నారు. కొందరు ప్రేమించిన వ్యక్తులతో వివాహ బంధంలోకి అడుగుపెడుతుంటే.. మరికొందరేమో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటూ వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా మరో నటి తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో సందడి చేసిన వాసంతి కృష్ణన్ ప్రియుడు పవన్ కల్యాణ్‌ ను వివాహం చేసుకుంది. వీరి పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ కాగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీరి వివాహ వేడుక తిరుపతిలో కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల మధ్యన అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. కాగా గతేడాది డిసెంబర్ 7న వీరి నిశ్చితార్థ వేడుక జరిగిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతికి చెందిన వాసంతి 2019లో సిరి సిరి మువ్వలు అనే సీరియల్‌తో బుల్లితెరపై అడుగులు వేసింది. గోరింటాకు, గుప్పెడంత మనసు వంటి సీరియల్స్ చేసింది. అలాగే క్యాలీఫ్లవర్ అనే మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. గతేడాది ‘భువన విజయం’ సినిమాలో నటించింది. కానీ అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. ఇక వాసంతి పెళ్లాడిన పవన్ కళ్యాన్ కూడా నటుడే. వీరిద్దరు గతేడాది ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యారు. నిన్న(మంగళవారం) తిరుపతిలో మూడుముళ్ల బంధంతో ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే వాసంతికి ఫాలోవర్స్ కూడా ఎక్కువే. ఎప్పటికప్పుడు ఫోటో షూట్లు, రీల్స్ తో సోషల్ మీడియాలో అదరగొడుతూ ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by @priyaaa14391

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet