iDreamPost
android-app
ios-app

భర్తపై నెహా చౌదరి కామెంట్స్.. అస్సలు మాట మీద నిలబడడు..!

  • Published Jul 12, 2023 | 5:06 PM Updated Updated Jul 12, 2023 | 5:08 PM
  • Published Jul 12, 2023 | 5:06 PMUpdated Jul 12, 2023 | 5:08 PM
భర్తపై నెహా చౌదరి కామెంట్స్.. అస్సలు మాట మీద నిలబడడు..!

నేహా చౌదరి.. ఈమె పేరు వినని బిగ్ బాస్ అభిమానులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఓ యాంకర్, మోడల్, డాన్సర్ గా ఇలా ఎన్నో రంగాల్లో ప్రావీణ్యం పొందిన ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపునే సంపాదించింది. అయితే, ఈ గుర్తింపుతోనే ఈ అమ్మడు బిగ్ బాస్ 6లో అడుగుపెట్టి అందరినీ అలరించింది. కానీ, బిగ్ బాస్ ఆమెకి పెద్దగా అచ్చు రాలేదనే చెప్పాలి. షో ప్రారంభంలోనే ఎలిమినెట్ అయి బయటకు వచ్చింది. ఇక వచ్చిన కొన్ని రోజుల్లోనే తన చిన్ననాటి స్నేహితుడు అనిల్ ను ప్రేమ వివాహం చేసుకుంది. మరో విషయం ఏంటంటే? బిగ్ బాస్ 6 గ్రాండ్ ఫినాలే రోజే ఆమె పెళ్లి చేసుకోవడం విశేషం.

ఇదిలా ఉంటే.. నేహా చౌదరి సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గానే ఉంటుంది. తన భర్తతో కలిసి చేసిన రీల్స్ తో పాటు కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే, తాజాగా ఈ అమ్మడు.. భర్తతో దిగిన ఓ ఫోటోను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్టూ చేస్తూ.. “నేను నిన్ను ద్వేషిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరి కంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. దీన్నే పెళ్లి అంటారు అనుకుంటా. నువ్వు ఎంత పెద్దగా గురుక పెట్టినా.., నన్ను కారు నడపనివ్వకపోయినా, స్వీట్స్, ఐస్ క్రీమ్స్ ఇవ్వకపోయినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నా కోసం నేను అడిగిన ఏ పని చేయకపోయినప్పటికీ సారీ చెప్పి ఇంకేప్పుడు చేయనని ఒట్టేసి మళ్లీ అదే పని 5 నిమిషాల్లో చేస్తావు. అయినా సరే నిన్ను చాలా.. చాలా.. ప్రేమిస్తూనే ఉంటాను. ఎందుకంటే.. నువ్వు నన్ను ప్రేమించే విధానం నాకు ఇష్టం. నువ్వు ఎప్పటికీ నావాడివే ” అంటూ నేహా చౌదరి తన ఇన్ స్టా గ్రామ్ లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో కాస్త వైరల్ గా మారింది. భర్తపై నెహా చౌదరి చేసిన ఈ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

 

View this post on Instagram

 

A post shared by Anchor Neha (@chowdaryneha)

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet