ఇటీవలే అనూహ్య పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జ్ఞాపకాల నుంచి ప్రేక్షకులు ఇంకా పూర్తిగా బయటికి రావడం లేదు. సోషల్ మీడియాలో ఇతని గొప్పదనాన్ని చాటే వీడియోలు బయటికి రావడంతో ఇంత చిన్న వయసులో కాలం చేయడం గురించి బాధ పడని సినీ ప్రేమికులు లేరు. మరోవైపు సుశాంత్ మరణానికి కొందరు ఇండస్ట్రీ పెద్దలే కారణమంటూ పలువురు బహిరంగంగానే మీడియా ముందుకు రావడంతో కొంత వివాదం కూడా చెలరేగింది. […]
సినిమా ప్రభావం యువత మీద అన్ని విషయాల్లోనూ ఉండదు కానీ అసలు లేదని మాత్రం చెప్పలేం. ముఖ్యంగా ఎమోషన్స్ కి సంబంధించి లేదా వయొలెన్స్ కి సంబంధించి ఏదో ఒక రూపంలో వాటిని అనుసరించే వారు సమాజంలో ఉండనే ఉంటారు. అలా స్నేహానికి నిర్వచనం ఇస్తూ 90వ దశకంలోని యూత్ లో ఒక ప్రత్యేకమైన ముద్ర వేసిన సినిమా ప్రేమ దేశం. 1996లో కదిర్ దర్శకత్వంలో వినీత్, అబ్బాస్ హీరోలుగా కెటి కుంజుమోన్ భారీగా నిర్మించిన ఈ […]
క్లాసిక్స్ అని పేరు తెచ్చుకున్న సినిమాలకు చరిత్రలో చెరిగిపోని స్థానం ఉంటుంది. అందులో మణిరత్నం రోజా ఒకటి. జాతీయ సమైక్యతను కాన్సెప్ట్ గా తీసుకుని దానికి టెర్రరిజం, భార్య భర్తల అనుబంధాన్ని జోడించి ఆయన తీసిన ఈ సెల్యులార్ వండర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ ఏఆర్ రెహమాన్ పాటలు ఉర్రూతలూగించే స్థాయిలో ఉంటాయి. దీనికి త్వరలో సీక్వెల్ రూపొందబోతోందని చెన్నై టాక్. ప్రస్తుతం తాను చేస్తున్న భారీ మల్టీ స్టారర్ విజువల్ వండర్ పొన్నియన్ […]
(ఇప్పుడంటే భారీ సినిమాలుగా బాహుబలి, సాహోల గురించి చెప్పుకుంటున్నాం కాని 90వ దశకంలోనే వీటికి ధీటుగా నిలిచిన ఓ క్రేజీ మూవీ గురించి, అప్పటి హైప్ ని ప్రత్యక్షంగా చూసిన వేరే హీరో అభిమాని మాటల్లో) 1997…… పదో తరగతి పూర్తి చేసుకుని ఏదో పెద్దరికం వచ్చిన ఫీలింగ్ తో ఇంటర్ మీడియట్ ఫస్ట్ ఇయర్ వెలగబెడుతున్న రోజులు. పెన్సిల్ తో గీసినట్టు వచ్చిన నూనూగు మీసాలకే క్షత్రియ పుత్రుడు కమల్ హాసన్ రేంజ్ లో బిల్డప్ […]
1996వ సంవత్సరం. దర్శకుడిగా శంకర్ పేరు అప్పటికే దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. హిందీలో డబ్ చేసిన సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతున్నాయి. ఆ టైంలో వచ్చిందే కమల్ హాసన్ భారతీయుడు . స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఓ యోధుడు ఇప్పటి సామాజిక పరిస్థితులను తట్టుకోలేక అన్యాయం అవినీతికి పాల్పడిన వాళ్ళ అంతు చూడటమే ఇందులో మెయిన్ పాయింట్. శంకర్ టేకింగ్, రెహమాన్ అద్భుతమైన సంగీతం నటీనటుల పెర్ఫార్మన్స్ వెరసి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పటికీ ఈ ఆల్బం […]