iDreamPost
android-app
ios-app

క్లాసిక్ సినిమాకు క్రేజీ సీక్వెల్

  • Published Jun 02, 2020 | 8:48 AM Updated Updated Jun 02, 2020 | 8:48 AM
  • Published Jun 02, 2020 | 8:48 AMUpdated Jun 02, 2020 | 8:48 AM
క్లాసిక్ సినిమాకు క్రేజీ సీక్వెల్

క్లాసిక్స్ అని పేరు తెచ్చుకున్న సినిమాలకు చరిత్రలో చెరిగిపోని స్థానం ఉంటుంది. అందులో మణిరత్నం రోజా ఒకటి. జాతీయ సమైక్యతను కాన్సెప్ట్ గా తీసుకుని దానికి టెర్రరిజం, భార్య భర్తల అనుబంధాన్ని జోడించి ఆయన తీసిన ఈ సెల్యులార్ వండర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ ఏఆర్ రెహమాన్ పాటలు ఉర్రూతలూగించే స్థాయిలో ఉంటాయి. దీనికి త్వరలో సీక్వెల్ రూపొందబోతోందని చెన్నై టాక్. ప్రస్తుతం తాను చేస్తున్న భారీ మల్టీ స్టారర్ విజువల్ వండర్ పొన్నియన్ సెల్వంకు కరోనా వల్ల పరిస్థితులు అంతగా అనుకూలంగా లేకపోవడంతో దానికన్నా ముందు రోజాకు కొనసాగింపుగా ఓ చిత్రం చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన మణిరత్నం సీరియస్ గా చేస్తున్నట్టు తెలిసింది.

అయితే రోజాలో కథనే ఇందులో కొనసాగిస్తారట. ఎలాగూ అరవింద్ స్వామి, మధుబాల ఆందుబాటులో ఉన్నారు. రోజా వచ్చి పాతికేళ్ళు దాటింది. సో వీళ్ళకు కొడుకు పుట్టి అతనూ నేషనల్ సెక్యూరిటీలో ఓ భాగంగా ఉండాల్సి వస్తే ఎలా ఉంటుందన్న కథలో మణిరత్నం ఏదో గట్టి ప్లానే వేశారట. యంగ్ హీరో పాత్రలో దుల్కర్ సల్మాన్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా చెబుతున్నారు. మణిరత్నం ఫామ్ లో లేని టైంలో ఓకే బంగారం రూపంలో కం బ్యాక్ హిట్ కొట్టింది దుల్కర్ తోనే. సో రోజా జంటకు వారసుడిగా ఇతన్నే కీలక పాత్రలో పెట్టి కొనసాగించే అవకాశం ఉందని వినికిడి. వినడానికి బాగానే ఉంది. సంగీత దర్శకుడిగా రెహమనే ఉంటారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

ఒకరిద్దరు తప్ప రోజాలో నటించిన కీలక తారాగణం అంతా బ్రతికే ఉంది కాబట్టి రోజాని అదే స్థాయిలో తెరకెక్కించే అవాకాశం ఉంది. దీనికి మణిరత్నం ఫ్యాన్స్ బాగా ఎగ్జైట్ అవుతున్నారు. కాంబినేషన్ కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్పుకుంటున్నారు. రోజాకు కొడుకు పుట్టి అతనూ దేశ రక్షణ కోసం పాటుపడటం అనే పాయింట్ చాలా థ్రిల్లింగ్ గా ఉందని సోషల్ మీడియాలో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. హీరొయిన్ ఇతర క్యాస్టింగ్ ఎవరుంటారో కార్యరూపం దాల్చినప్పుడు బయటికి వస్తుంది. మరి నిజంగా మణిసర్ మైండ్ లో ఈ రోజా 2 సీరియస్ గా ఉందో లేక ఆలోచన దశలో ఉందో వేచి చూడాలి. ఇవాళ మణిరత్నం పుట్టినరోజు. ఇంతకన్నా గుడ్ న్యూస్ అభిమానులకు ఏం కావాలి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabet