iDreamPost
android-app
ios-app

ఇండియాలో రిచెస్ట్ గాయని ఎవరో తెలుసా? AR రెహమాన్ తో పోలిస్తే..

  • Author Soma Sekhar Published - 03:08 PM, Tue - 11 July 23
  • Author Soma Sekhar Published - 03:08 PM, Tue - 11 July 23
ఇండియాలో రిచెస్ట్ గాయని ఎవరో తెలుసా? AR రెహమాన్ తో పోలిస్తే..

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రతిభావంతులైన సింగర్స్ ఉన్నారు. ఇక ఇండస్ట్రీలో సింగర్స్ కు ఉన్న పాపులారిటీ అంతా ఇంత కాదు. కొంత మంది స్టార్ సింగర్స్ కు ఉన్న క్రేజ్ స్టార్ హీరోలకు కూడా లేదంటే అతిశయోక్తికాదు. కాగా.. ప్లే బ్యాక్ సింగింగ్ ను తమ కెరీర్ గా ఎంచుకున్న మహిళలు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. టాలీవుడ్ లో అలనాటి గాయనీమణులు సుశీల, జానకి, వాణీ జయరాం, సునీత, చిన్మయి,ఉష, చిత్ర లాంటి ప్రముఖులు ఉన్నారు. వీరితో పాటుగా ఇతర సినిమా పరిశ్రమలకు చెందిన లతామంగేష్కర్, ఆశా భోంశ్లే, సునిధి చౌహాన్, శ్రేయా ఘోషల్, నేహా కక్కర్ లాంటి ఈ తరం సింగర్స్ యూత్ ను ఆకట్టుకుంటున్నారు. అయితే ఇండియాలో ఉన్న రిచెస్ట్ గాయని ఎవరో చాలా మందికి తెలీదు. ఈ నేపథ్యంలో ఇండియాలో ఉన్న రిచెస్ట్ గాయని ఎవరో ఇప్పుడు చూద్దాం.

ఇండియన్ సినిమా హిస్టరీలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇండస్ట్రీ ప్రారంభంలో 1950-60ల్లో సింగర్స్ కు పైసా కూడా ఇచ్చేవారు కాదట. ఈ క్రమంలో స్టార్ సింగర్స్ లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ లాంటి వారు పోరాటం చేయడంతో.. సింగర్స్ కు రెమ్మునరేషన్ ఇవ్వడం ప్రారంభించారు. ప్రస్తుతం చాలా మంది గాయకులు ఒక్కోపాటకు లక్షల్లో పారితోషికాలు అందుకుంటున్నారు. కాగా.. అత్యంత రిచెస్ట్ లేడీ గాయని ఎవరంటే కొన్ని పేర్లు వినిపిస్తాయి. రిచెస్ట్ సింగర్స్ అనగానే శ్రేయ ఘోషల్, చిన్మయి శ్రీపాద లాంటి సింగర్స్ గుర్తుకు వస్తారు.

కానీ వీరందరిని తలదన్నుతూ.. ఓ సింగర్ ఇండియాలోనే రిచెస్ట్ లేడీ సింగర్ గా నిలిచింది. ఆమె పేరే తులసీ కుమార్.  37 ఏళ్ల ఈ బాలీవుడ్ లేడీ సింగర్ నికర ఆస్తుల విలువ అక్షరాల రూ. 200 కోట్లు. పాటలతో పాటుగా.. కుటుంబ వ్యాపారం నుంచి వచ్చిన సంపద కూడా ఆమె నెట్ వర్త్ కు జత కలిసింది. ఈమె తర్వాత సుమారు 180-185 కోట్లతో శ్రేయా ఘోషల్ ఉండగా.. రూ. 100 కోట్లతో సునిధి చౌహాన్ ఉన్నారు. ఇక ఇండియన్ సింగింగ్ లెజెండ్ ఆశా భోంస్లే నికర ఆస్తుల విలువ రూ. 80 కోట్లు ఉండగా.. లేటెస్ట్ సింగింగ్ సెన్సేషన్ సింగర్ నేహా కక్కర్ దాదాపు రూ. 40 కోట్ల ఆస్తులను కలిగి ఉంది. కాగా.. ఇండియాలో అత్యంత ధనిక గాయకుడితో పోల్చితే.. తులసి నికర విలువ తక్కువనే చెప్పాలి.

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ నికర ఆస్తి విలువ రూ.500 కోట్లకు పై మాటే. ఇది చాలా మంది బాలీవుడ్ స్టార్ హీరోల కంటే ఎక్కువ కావడం గమనార్హం. టీ-సిరీస్ యజమాని భూషణ్ కుమార్ సోదరిగా తులసికి సుమారు రూ.4000 కోట్ల కంపెనీలో ఆమెకు వాట ఉండటంతో.. ఆమె ఆస్తులు విలువ పెరుగుతూనే ఉంటుంది. ఇక తులసి కెరీర్ విషయానికి వస్తే.. 2009లో ‘లవ్ హో జే’ ఆల్బంతో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. అనేక మ్యూజిక్ వీడియోలు, ఆల్బమ్ లతో మిలియన్ల కొద్ది వ్యూస్ తో ఇండియావైడ్ గా దుమ్మురేపుతోంది. తన గాత్రంతో ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను కొల్లగొట్టింది తులసీ కుమార్.