iDreamPost
android-app
ios-app

వైరల్ అవుతున్న అనుష్క , ప్రభాస్ లుక్స్.. ఇద్దరు ఒకేలా !

  • Published Nov 07, 2024 | 4:04 PM Updated Updated Nov 07, 2024 | 4:04 PM

Anushka , Prabhas New Looks : అనుష్క , ప్రభాస్ .. ఈ పెయిర్ కి సిల్వర్ స్క్రీన్ పై సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. బాహుబలి తర్వాత ఈ జోడీని సిల్వర్ స్క్రీన్ మీద చూసింది లేదు. కానీ రీసెంట్ గా సోషల్ మీడియాలో మాత్రం ఈ ఇద్దరు తెగ వైరల్ అవుతున్నారు. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

Anushka , Prabhas New Looks : అనుష్క , ప్రభాస్ .. ఈ పెయిర్ కి సిల్వర్ స్క్రీన్ పై సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. బాహుబలి తర్వాత ఈ జోడీని సిల్వర్ స్క్రీన్ మీద చూసింది లేదు. కానీ రీసెంట్ గా సోషల్ మీడియాలో మాత్రం ఈ ఇద్దరు తెగ వైరల్ అవుతున్నారు. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

  • Published Nov 07, 2024 | 4:04 PMUpdated Nov 07, 2024 | 4:04 PM
వైరల్ అవుతున్న అనుష్క , ప్రభాస్ లుక్స్.. ఇద్దరు ఒకేలా !

అనుష్క శెట్టి , ప్రభాస్ ఈ పెయిర్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఈ ఆన్ స్క్రీన్ కపుల్ ఆఫ్ స్క్రీన్ లో కూడా ఒకటైతే చూడాలని ఎంతో మంది కల. ఆ మధ్య వీరిద్దరి పెళ్లి గురించి  గాసిప్స్ కూడా బాగానే వినిపించాయి. కానీ అవి ఎటూ తేలట్లేదు అది వేరే విషయం. సరే పోనీ ఆన్ స్క్రీన్ మీద అయినా వీరిద్దరిని కలిపి చూద్దాం అనుకుంటే.. అది కూడా జరగట్లేదు. బాహుబలి తర్వాత మళ్ళీ ఈ జంటను కలిసి చూసిందే లేదు. దీనితో ఈ ఇద్దరి మ్యూచువల్ ఫ్యాన్స్ ఈ పెయిర్ కలయిక కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఎప్పుడెప్పుడు  కనిపిస్తారా అని వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనుష్క , ప్రభాస్ ఇద్దరూ సిమిలర్ లుక్ లో ఉన్న ఫోటో ఒకటి కనిపించింది. ఇంకేముంది దొరికిందే ఛాన్స్.. ఆ రెండు ఫొటోస్ ను పక్క పక్కన పెట్టి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

చాలా కాలం తర్వాత అనుష్క శెట్టి సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. బాహుబలి తర్వాత ఈ అమ్మడు భాగమతి అంటూ ఓ హిట్ కొట్టింది. ఇక ఆ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో మరో డీసెంట్ హిట్. దాదాపు అనుష్క అన్నీ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలనే సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ అమ్మడు క్రిష్ దర్శకత్వంలో.. ఘాటి అనే సినిమాతో రాబోతుంది. అనుష్క బర్త్ డే సంధర్బంగా ఈ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో అనుష్క చాలా డిఫరెంట్ గా కనిపించింది. ఇప్పటివరకు అనుష్క ఇలా ఎప్పుడు కనిపించలేదు. సిగార్ పొగ మధ్యలో చాలా ఇంటెన్స్ లుక్ లో అనుష్క ఆకట్టుకుంది. చాలా కాలం తర్వాత అనుష్క మళ్ళీ కనిపించింది కాబట్టి.. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం సహజం. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే… ఇప్పుడు ఈ లుక్స్ ను డీకోడ్ చేసి ప్రభాస్ లుక్స్ తో పోల్చుతున్నారు. రీసెంట్ గా ప్రభాస్ బర్త్ డే సంధర్బంగా రాజాసాబ్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ప్రభాస్ కూడా ఓల్డ్ గెటప్ లో.. స్మోకీ లుక్ తో దర్శనం ఇచ్చాడు. దీనితో ఇప్పుడు ఇద్దరూ సిగార్ తాగుతూనే కనిపించారంటూ.. ఇద్దరి ఫొటోస్ పక్క పక్కన పెట్టి వైరల్ చేస్తున్నారు. రాజావారు రాణి వారు అంటూ.. అసలు మీరిద్దరూ ఎందుకు కలిసి సినిమా తీయకూడదు.. అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. డార్లింగ్ ను , స్వీటీ ని ఒకే స్క్రీన్ మీద చూసి చాలా కాలం అయింది కాబట్టి.. వారి కామెంట్స్ వెనుక వాస్తవం లేకపోలేదు. ఇలా కోఇన్సిడెంట్ గా కలిసినా ఉన్న ప్రభాస్ , అనుష్కల ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఫ్యూచర్ లో సినిమాలు వస్తాయో లేదో తెలియదు కానీ.. ఒకవేళ వస్తే మాత్రం అది మరో కల్ట్ క్లాసిక్ ఫిల్మ్ అవుతుందని ఎవరైనా చెప్పేస్తారు. ఇక ఇప్పుడు ప్రభాస్ కు రాజాసాబ్ , అనుష్క కు ఘాటీ ఎలాంటి సక్సెస్ ను అందిస్తాయో చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş