iDreamPost
android-app
ios-app

అనుష్క మూవీకి అప్పుడే హై డిమాండ్

  • Published May 13, 2025 | 11:03 AM Updated Updated May 13, 2025 | 11:42 AM

స్వీటీ సినిమా అంటే ప్రతి ఒక్కరిలో ఓ తెలియని ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అరుంధతి అనుష్క క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఈ క్రమంలో స్వీటీ లేటెస్ట్ మూవీ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది అదేంటో చూసేద్దాం.

స్వీటీ సినిమా అంటే ప్రతి ఒక్కరిలో ఓ తెలియని ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అరుంధతి అనుష్క క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఈ క్రమంలో స్వీటీ లేటెస్ట్ మూవీ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది అదేంటో చూసేద్దాం.

  • Published May 13, 2025 | 11:03 AMUpdated May 13, 2025 | 11:42 AM
అనుష్క మూవీకి అప్పుడే హై డిమాండ్

టాలీవుడ్ లో అనుష్క నుంచి సినిమా వచ్చి చాలా కాలమే అయింది. దీనితో ఆమె ఫ్యాన్స్ కాస్త అప్ సెట్ అవుతున్నారన్నమాట వాస్తవం. ఆఖరిగా అనుష్క చేసిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. కమర్షియల్ పరంగా ఈ సినిమా బాగానే వర్క్ అవుట్ అయింది. ఈ సినిమా తర్వాత అనుష్క నుంచి ఏ సినిమాలు లేవు. అనుష్క మూవీ గురించి ఎప్పుడెప్పుడు ఏ అప్డేట్ వస్తుందా.. స్వీటీ ఈసారి ఎలాంటి క్యారెక్టర్ లో కనిపిస్తుందా అని ఎదురుచూసే ప్రేక్షకులకు ఒక్కసారిగా ఘాటీ గ్లిమ్ప్స్ తో షాక్ ఇచ్చింది. ఇక ఆ గ్లిమ్ప్స్ తర్వాత ఇప్పటివరకు అయితే ఎలాంటి అప్డేట్ లేదు. కానీ రీసెంట్ గా సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

అనుష్క మూవీ అనగానే ముందు వెనుక చూడకుండా బిజినెస్ బాగా జరుగుతుందట. UV క్రియేషన్స్ , ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ డిజిటల్ , శాటిలైట్ రైట్స్ ఆల్రెడీ సేల్ అయినట్టు సమాచారం. ఈ మూవీకి ఓ మంచి డీల్ సెట్ అయిందట. తెలుగుతో పాటు హిందీ రైట్స్ కూడా మంచి ధరకు అమ్ముడైనట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. తానూ రాసుకున్న కథకు అనుష్క అయితేనే సెట్ అవుతుందని… ఆమెని ఒప్పించి మరి ఈ సినిమా తీస్తున్నాడట క్రిష్. ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు టాలీవుడ్ లో ఎప్పుడు మంచి క్రేజ్ ఉంటుంది. అందులో అనుష్క సినిమా అంటే ఇక కచ్చితంగా అంచనాలు భారీగా ఉంటాయి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఫ్యాన్స్ ఈ సినిమాను కచ్చితంగా సక్సెస్ చేస్తారని భావిస్తున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ సినిమా అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.