iDreamPost
android-app
ios-app

OTTలోకి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’! స్ట్రీమింగ్ ఎందులో అంటే?

  • Author Soma Sekhar Published - 05:39 PM, Sat - 30 September 23
  • Author Soma Sekhar Published - 05:39 PM, Sat - 30 September 23
OTTలోకి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’! స్ట్రీమింగ్ ఎందులో అంటే?

OTTలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రేక్షకులు థియేటర్ లో మిస్ అయిన సినిమాలను ఎప్పుడెప్పుడు ఇందులో చూద్దామా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ప్రముఖ ఓటీటీలు సైతం కొత్త సినిమాలు, సిరీస్ లతో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా గ్యాప్ తర్వాత హీరోయిన్ అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో వెండితెరపై మెరిసింది. సెప్టెంబర్ 7న రిలీజ్ అయిన ఈ మూవీ.. పాజిటీవ్ టాక్ తో ఇప్పటి వరకు దాదాపు రూ. 50 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది సంస్థ. మరి ఈ చిత్రం ఏ ఓటీటీలో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం.

అనుష్క-నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. డైరెక్టర్ పి. మహేశ్ బాబ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. చిరంజీవి తొలి ప్రేక్షకుడిగా ఇచ్చిన రివ్యూతో.. సినిమాకు తొలి షో నుంచే పాటిటీవ్ టాక్ రావడం మెుదలైంది. ఇక ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ లో అక్టోబర్ 5 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అఫీషియల్ గా ప్రకటించింది. తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, తమిళ్, హిందీలో అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. దీంతో ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. ఇక ఈ మూవీలో నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు సినిమాలో కంటే రెట్టింపు వినోదం అందించాడని సినీ ప్రముఖులు అతడి నటనపై ప్రశంసలు కురిపించారు.