iDreamPost
android-app
ios-app

కృష్ణంరాజు వర్ధంతి.. అనుష్క ఎమోషనల్ పోస్ట్!

  • Author Soma Sekhar Published - 03:08 PM, Mon - 11 September 23
  • Author Soma Sekhar Published - 03:08 PM, Mon - 11 September 23
కృష్ణంరాజు వర్ధంతి.. అనుష్క ఎమోషనల్ పోస్ట్!

దివంగత నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించి నేటి(సెప్టెంబర్ 11)తో ఏడాది గడిచిపోయింది. దీంతో ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. అయితే ఇండస్ట్రీకి చెందిన కొందరు ఆయన వర్ధంతిని మర్చిపోయినా కానీ.. అనుష్క మాత్రం మర్చిపోలేదు. కృష్ణంరాజు మెుదటి వర్ధంతిని గుర్తుచేసుకుంటూ.. సోషల్ మీడియా వేదికగా ఎమోషల్ పోస్ట్ ను షేర్ చేసింది. ఇక పోస్ట్ ను చూసిన నెటిజన్లు, రెబల్ స్టార్ ఫ్యాన్స్, డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ అనుష్కకు పెద్దాయన అంటే ఎంత ప్రేమో అంటూ అభినందిస్తున్నారు.

రెబల్ స్టార్ కృష్ణంరాజు 2022 సెప్టెంబర్ 11న మరణించిన విషయం తెలిసిందే. ఆయన మన నుంచి దూరం అయ్యి నేటితో సరిగ్గా ఏడాది కావొస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రధమ వర్ధంతిని గుర్తుచేసుకుంటూ.. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. రెబల్ స్టార్ తో తమకు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ అనుష్క సైతం కృష్ణంరాజుపై తనకున్న ప్రేమను వెల్లడించింది. ఆయన మరణించినప్పుడు కన్నీరు పెట్టుకున్న స్వీటీ.. తాజాగా ఆయన తొలి వర్ధంతి సందర్భంగా.. సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది.

“మంచి మనసున్న వ్యక్తి కృష్ణంరాజుగారు, గొప్ప నటుడిగా, గొప్ప మనిషిగా ఆయన ప్రేమతో మిగిల్చిన జ్ఞాపకాలను నేను ఎన్నటికి మరవలేను” అంటూ రాసుకొచ్చింది అనుష్క. కాగా.. అనుష్కకు కృష్ణంరాజు ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉందన్న సంగతి మనకు తెలియనిది కాదు. అదీకాక ప్రభాస్ తో అనుష్క మళ్లీ జోడీ కట్టాలని ఎంతో మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు కూడా. ప్రభాస్ తో బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలతో ఈ జోడీ ప్రేక్షకుల్లో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది. బిల్లా సినిమా నుంచే అనుష్కతో రెబల్ స్టార్ ఫ్యామిలీతో మంచి అనుబంధం ఏర్పడింది. మరి మర్చిపోకుండా పెద్దాయన కృష్ణంరాజు వర్ధంతి రోజున ఎమోషనల్ పోస్ట్ చేసిన అనుష్కపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş