iDreamPost
android-app
ios-app

భయంకరమైన శబ్దంతో ‘నిశ్శబ్దం’

  • Published Mar 07, 2020 | 6:09 AM Updated Updated Mar 07, 2020 | 6:09 AM
  • Published Mar 07, 2020 | 6:09 AMUpdated Mar 07, 2020 | 6:09 AM
భయంకరమైన శబ్దంతో ‘నిశ్శబ్దం’

భాగమతి తర్వాత ఏకంగా రెండేళ్ల గ్యాప్ తీసుకుని అనుష్క చేసిన నిశ్శబ్దం వచ్చే నెల 2న విడుదల కాబోతోంది. అభిమానులు తన కోసం ఎదురు చూసి చూసి ఇప్పటికే కళ్ళు కాయలు కాచాయి. వాటికి చెక్ పెడుతూ స్వీటీ వెండితెరపైకి వస్తోంది. నిన్న సోషల్ మీడియా వేదికగా నాని ద్వారా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. కథ విషయానికి వస్తే ఆ అమ్మాయి(అనుష్క)కు మాటలు రావు. చెవులు వినిపించవు. ఓ విచిత్రమైన పరిస్థితిలో తన మీద దాడి జరుగుతుంది. అది ఓ దెయ్యం చేసిన పనని తన నమ్మకం.

ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తుంది లేడీ ఆఫీసర్(అంజలి). ఆ దెయ్యం వెనుక ఓ యువతి(షాలిని పాండే)కథ ఉందని తెలుసుకుని ఆ కోణంలో విచారణ మొదలుపెడుతుంది. ఈ సంఘటనలకు మరో వ్యక్తి(మాధవన్)కి లింక్ ఉంటుంది. మరోవైపు అంతుచిక్కని రీతిలో దారుణమైన హత్యలు కొనసాగుతూ ఉంటాయి. అసలు ఇంత భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్న ఈ నిశ్శబ్దం వెనుక కథేంటి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. కథలో మంచి డెప్త్ తో పాటు బోలెడంత థ్రిల్స్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఇంగ్లీష్ లోనూ విడుదల చేస్తున్నారు కాబట్టి ఆ స్థాయి మేకింగ్ వాల్యూస్ అయితే కనిపిస్తున్నాయి.

గోపి సుందర్ సంగీతం, షానియల్ డియో ఛాయాగ్రహణం దానికి తగ్గట్టే ఉన్నాయి. ఇది వరకు చేయని సరికొత్త పాత్రలో అనుష్క డిఫరెంట్ గా కనిపిస్తోంది. సవ్యసాచి తర్వాత కనిపించని మాధవన్ ఇందులోనే దర్శనమిస్తున్నాడు. సుబ్బరాజు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో మంచి ఇంటెన్సిటి కనిపిస్తోంది. అంచనాలకు తగ్గట్టు సినిమా ఉంటే మాత్రం స్వీటీకి మరో హిట్టు పడ్డట్టే. ఆ మధ్య సైరాలో ఓ రెండు నిముషాలు కనిపించినాదాన్ని ఫ్యాన్స్ కౌంట్ లోకి వేసుకోవడం లేదు కాబట్టి అంచనాలన్నీ దీని మీదే అధికంగా ఉన్నాయి. మరి నిశ్శబ్దం బాక్స్ ఆఫీస్ ఎంత పెద్ద సౌండ్ చేస్తుందో తెలియాలంటే ఏప్రిల్ 2 దాకా ఆగాల్సిందే.

Trailer Link Here @ http://bit.ly/39uGIv5

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetjojobet girişjojobet güncel girişdeneme bonusu veren sitelerMariobetmadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasibombetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet