ఈ ఏడాది ప్రారంభంలో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన జాతిరత్నాలుని ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ చేసిన దర్శకుడు అనుదీప్ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దానికే సీక్వెల్ తీస్తారని ప్రచారం జరిగింది కానీ ఎందుకో అది ముందుకు సాగలేదు. ఓటిటి రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో వ్యక్తమైన అభిప్రాయాలు, నెగటివ్ ఫీడ్ బ్యాక్ చూసి ఏమైనా పునరాలోచనలో పడ్డారో ఏమో తెలియదు. మొత్తానికి యుఎస్ లో తీయాలని ప్లాన్ చేసుకున్న రెండో భాగం మాత్రం ఆగిపోయిందని […]
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని పెద్దలు అన్నట్టు ఇప్పుడు తమిళ హీరోలు – తెలుగు దర్శకులు, అలాగే తెలుగు హీరోలు – తమిళ దర్శకుల కాంబినేషన్లు రెండు భాషల సినిమా ఇండస్ట్రీలోనూ ఆసక్తికరంగా మారాయి. గతం నుంచి చూస్తే కనుక తమిళ దర్శకులు తెలుగు హీరోలను డైరెక్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి కానీ తెలుగు దర్శకులు నేరుగా తమిళ హీరోలను తెలుగులో నటింపజేయడం అనే ట్రెండ్ ఇప్పుడే మొదలైంది. అలాగే తమిళ దర్శకులు – తెలుగు […]
ఈ ఏడాది బ్లాక్ బస్టర్స్ టాప్ 3లో చోటు కొట్టేసిన జాతరత్నాలు బుల్లితెరపై కూడా సత్తా చాటింది. ఏకంగా 10. 5 టిఆర్పితో జెమిని ఛానల్ కు మంచి కిక్కే ఇచ్చింది. కానీ ఇంతకన్నా ఎక్కువ ఆశించిన సదరు యాజమాన్యం దీని పట్ల ఏ మేరకు హ్యాపీగా ఉన్నారో మరి. నిజానికి ఈ టెలివిజన్ ప్రీమియర్ చాలా ఆలస్యంగా జరిగింది. ఎప్పుడో మార్చిలో సినిమా రిలీజైతే అయిదు నెలల తర్వాత బుల్లితెరపై రావడం అంటే లేట్ అన్నట్టే […]