iDreamPost
android-app
ios-app

క్రేజీ కాంబో సెట్టు.. అనుదీప్ డైరెక్షన్ లో విశ్వక్ సేన్!

  • Published Jul 04, 2024 | 8:57 PM Updated Updated Jul 04, 2024 | 8:57 PM

Vishwak Sen And Director Anudeep Combo: టాలీవుడ్ లో ఇప్పుడు ఒక క్రేజీ కాంబో సెట్స్ మీదకు రాబోతోంది అంటున్నారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కాంబోలో సినిమా సెట్టు అని టాక్ వస్తోంది.

Vishwak Sen And Director Anudeep Combo: టాలీవుడ్ లో ఇప్పుడు ఒక క్రేజీ కాంబో సెట్స్ మీదకు రాబోతోంది అంటున్నారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కాంబోలో సినిమా సెట్టు అని టాక్ వస్తోంది.

  • Published Jul 04, 2024 | 8:57 PMUpdated Jul 04, 2024 | 8:57 PM
క్రేజీ కాంబో సెట్టు.. అనుదీప్ డైరెక్షన్ లో విశ్వక్ సేన్!

టాలీవుడ్ లో ఈ మధ్య కొన్ని కొన్ని క్రేజీ కాంబోలు సెట్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ లిస్టులోకి ఇద్దరు క్రేజీ స్టార్స్ వచ్చి చేరారు. సాధారణంగా యంగ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే డైరెక్టర్ అనుదీప్ అంటే తెలుగు ప్రేక్షకులు అంతా ఈవ్.. అంటూ గోల గోల చేస్తారు. ఇలాంటి ఇద్దరు క్రేజీ స్టార్స్ కాంబోలో ఒక సినిమా రాబోతోంది అంటూ వార్తలు జోరందుకున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా విడుదల కాబోతోంది అంటూ టాలీవుడ్ వర్గాల్లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.

టాలీవుడ్ లో ఉన్న ఇప్పుడున్న యంగ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా సెల్ఫ్ మేడ్ హీరో అనే చెప్పాలి. ఎలాంటి సపోర్ట్ లేకుండానే తనని తాను లేపుకుంటూ ఇక్కడి దాకా వచ్చాడు. ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా కూడా కొనసాగుతున్నాడు. తాజాగా విశ్వక్ నుంచి లైలా మూవీ అప్ డేట్ వచ్చిన విషయం తెలిసిందే. గ్రాండ్ గా సినిమాకి పూజాకార్యక్రమం నిర్వహించారు. లేడీ గెటప్ లో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కెరీర్లో తొలిసారి ఒక లేడీ గెటప్ లో విశ్వక్ ని చూడబోతున్నారు. ఇప్పటి వరకు గడ్డం, మీసాలు పెట్టుకుని ఊర మాస్ లుక్స్ కూడా ట్రై చేసిన విశ్వక్ సేన్.. ఇప్పుడు తొలిసారి ఒక అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నాడు అంటేనే ఫ్యాన్స్ అంతా పిచ్చెక్కిపోతున్నారు.

ఇప్పుడు అంతకన్నా పిచ్చెక్కించే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అదే జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్- విశ్వక్ సేన్- 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ కాంబోలో కొత్త సినిమా రాబోతోందంట. ఇప్పుడు టాలీవుడ్ లో ఈ విషయం మీద చర్చ జరుగుతోంది. విశ్వక్ సేన్ ఎనర్జీ, కామెడీ టైమింగ్ కి.. అనుదీప్ పంచ్ డైలాగులు పడితే థియేటర్లో రచ్చ రచ్చే అంటున్నారు. అయితే ఈ కాంబోకి సంబంధించి.. ఈ సినిమాకి సంబంధించి, ఈ కాంబోకి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ, త్వరలోనే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోంది అంటున్నారు. కానీ, ఇది మాత్రం నిజం కావాలి అని మాస్ కా దాస్ ఫ్యాన్స్ గట్టిగానే కోరుకుంటున్నారు. మరి.. విశ్వక్ సేన్- అనుదీప్ కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomjojobetcasibomfixbetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş