iDreamPost
android-app
ios-app

బుల్లితెరపై అదరగొట్టిన చిన్న సినిమా

  • Published Sep 04, 2021 | 8:44 AM Updated Updated Sep 04, 2021 | 8:44 AM
బుల్లితెరపై అదరగొట్టిన చిన్న సినిమా

ఈ ఏడాది బ్లాక్ బస్టర్స్ టాప్ 3లో చోటు కొట్టేసిన జాతరత్నాలు బుల్లితెరపై కూడా సత్తా చాటింది. ఏకంగా 10. 5 టిఆర్పితో జెమిని ఛానల్ కు మంచి కిక్కే ఇచ్చింది. కానీ ఇంతకన్నా ఎక్కువ ఆశించిన సదరు యాజమాన్యం దీని పట్ల ఏ మేరకు హ్యాపీగా ఉన్నారో మరి. నిజానికి ఈ టెలివిజన్ ప్రీమియర్ చాలా ఆలస్యంగా జరిగింది. ఎప్పుడో మార్చిలో సినిమా రిలీజైతే అయిదు నెలల తర్వాత బుల్లితెరపై రావడం అంటే లేట్ అన్నట్టే లెక్క. అమెజాన్ ప్రైమ్ లో మాత్రం కేవలం 30 రోజులకే అందుబాటులోకి తెచ్చారు. ఈలోగా స్మార్ట్ టీవీలో, లోకల్ కేబుల్ ఛానల్స్ లో లక్షలాది ప్రేక్షకులు జాతరత్నాలు చూసి ఎంజాయ్ చేసేశారు. అందుకే రేటింగ్స్ తగ్గాయని చెప్పొచ్చు.

ఎలా చూసుకున్నా ఇది చెప్పుకోదగ్గ స్పందనే. స్టార్ క్యాస్టింగ్ లేని సినిమాకు ఈ స్థాయిలో రావడం విశేషమే. కాకపోతే ఉప్పెనను దాటుతుందేమో అని అంచనా వేసిన విశ్లేషకుల లెక్కలు తప్పాయి. అదే రోజు ఎవరు మీలో కోటీశ్వరులు టెలికాస్ట్ జరగడం, కొందరు ప్రేక్షకులు దాని కోసం ఎదురు చూసి జాతిరత్నాలుని లైట్ తీసుకోవడం లాంటి కారణాలు కొట్టిపారేయలేం. ఏమైనా ఒక సినిమా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్నాక ఓటిటిలో ఎంత వేగంగా వస్తుందో అంతే స్పీడ్ తో శాటిలైట్ ఛానల్స్ లోనూ వచ్చినప్పుడే రికార్డులు ఆశించవచ్చు. లేదంటే ఫలితం ఇలా ఎంతో హ్యాపీ కొంచెం సాడ్ లా వస్తుంది.

ఈ ఎంటర్ టైనర్ కి సీక్వెల్ రావొచ్చనే ప్రచారం జరిగింది కానీ కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు. దర్శకుడు అనుదీప్ వేరే ప్రాజెక్టుతో లాక్ అయ్యేలా ఉన్నాడు. స్వప్న సినిమా సంస్థ కూడా కొనసాగింపు గురించి ఎలాంటి క్లూస్ ఇవ్వడం లేదు. ఇటీవలి కాలంలో ఇటు సినిమాలు అటు రియాలిటీ షోల మీద ఏకకాలంలో ఫోకస్ చేస్తున్న జెమినిని స్టార్ మా, జీ తెలుగు నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. హక్కుల విషయంలో నువ్వా నేనా అనే స్థాయిలో డిమాండ్ పెంచుతున్నారు. కనీసం 15కు పైగా రేటింగ్ వస్తేనే ఒక బ్లాక్ బస్టర్ ప్రీమియర్ వల్ల ఏ ఛానల్ కైనా కిట్టుబాటు అవుతుంది. కాకపోతే ఇంత నెమ్మదిగా కాకుండా త్వరగా ప్రసారం చేయాలి మరి

Also Read : సీక్రెట్ మిషన్ లో NIA ఏజెంట్