పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు . ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున అంటే 2014 డిసెంబర్ 31 న విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని భూ సమీకరణ కార్యకలాపాలు మొదలయ్యాయి . చంద్రబాబు చూపించిన ఊహాలోకం మాయలో కొందరు రైతులు భూములిచ్చారు . కొందరు ఒప్పించబడ్డారు , కొందరు బెదిరింపబడ్డారు , కొందరు దండనతో దారికొచ్చి ఇచ్చారు . సామ ,దాన , భేద , దండోపాయాలతో పాటు ఆర్ధిక సామాజిక వర్గ ప్రలోభాలు కూడా […]
దేశ రాజధాని లేదా రాష్ట్రాల రాజధానుల నుంచి ప్రజలు ఆశించేంది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మాత్రమే. అవి ఎంత దూరం ఉన్నా సరే అక్కడ జీవనోపాధి ఉంటే చాలు అక్కడికి వెళతారు. అక్కడ ఉండే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టులతో వారికి ఎలాంటి ఉపయోగం లేదు. వాటితో సామాన్య ప్రజలకు ఎలాంటి అవసరం ఉండదు. కేవలం రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు మాత్రమే సచివాలయం, అసెంబ్లీతో పని ఉంటుంది. హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి కారణం అక్కడ ఉన్న ఉపాధి, […]
ఏపీలో మందు బాబులుల్లో మార్పు వస్తోందా.. మెల్లి మెల్లిగా మద్యం కోరల్లోనుంచి బయటపడుతున్నారా ? పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. గణాంకాలు సైతం ఇదే విషయాన్ని వెల్లడిస్తుండటంతో ఏపీలో మత్తు వదులుతోందని భావించాల్సిందే. దశలవారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుచేస్తామని ఎన్నికల్లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగా అధికారం చేజిక్కించుకున్న వెంటనే బెల్టు షాపులకు మంగళం పాడారు . దీంతో పాటు నూతన మద్యం పాలసీ తెచ్చి […]