iDreamPost
android-app
ios-app

AP లో జూనియర్ సివిల్ జడ్జీగా తెలంగాణ యువతి..!

  • Published Jan 28, 2024 | 2:29 PM Updated Updated Jan 28, 2024 | 2:29 PM

చిన్నప్పటి నుంచి తన తల్లిని స్ఫూర్తిగా తీసుకున్న ఓ యువతి అతి చిన్న వయసులోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి సివిల్ జడ్జిగా నియామకమైంది. గొప్ప కీర్తి ప్రతిష్ఠలను పొంది నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచింది. ఇంతకి ఆమె ఎవరంటే..

చిన్నప్పటి నుంచి తన తల్లిని స్ఫూర్తిగా తీసుకున్న ఓ యువతి అతి చిన్న వయసులోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి సివిల్ జడ్జిగా నియామకమైంది. గొప్ప కీర్తి ప్రతిష్ఠలను పొంది నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచింది. ఇంతకి ఆమె ఎవరంటే..

  • Published Jan 28, 2024 | 2:29 PMUpdated Jan 28, 2024 | 2:29 PM
AP లో జూనియర్ సివిల్ జడ్జీగా తెలంగాణ యువతి..!

జీవితంలో ప్రతిఒక్కరూ గొప్ప ఉన్నత స్థాయికి చేరాలంటే.. ‘కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి’ అని అబ్దుల్ కలాం చెప్పిన అద్భుతమైన పార్ములాని పాటించాలి. అవును కలలు కనడం తప్పు కాదు.. దానికోసం శ్రమించకపోవడం తప్పు. అయితే తాజాగా ఈ ఫార్ములానే ఓ యువతి అనుసరించిందే ఏమో కానీ, నేడు తన జీవితంలో గొప్ప మైలు రాయిని దాటింది. చిన్నప్పటి నుంచి తన తల్లిని స్ఫూర్తిగా తీసుకున్న ఆ యువతి అమె ఆశయాలను కలలు మాత్రమే కనలేదు. అందుకోసం ధృడ సంకల్పంతో కృషి చేసింది. అతి చిన్న వయస్సులోనే గొప్ప కీర్తి ప్రతిష్ఠలను పొంది నేటి తరానికి ఆమె ఒక ఆదర్శంగా నిలిచింది. న్యాయశాస్త్ర విభాగంలో ఉత్తీర్ణురాలై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు సివిల్ జడ్జి గా నియామకమైంది. ఇంతకి ఆమె ఎవరంటే..

తెలంగాణ రాష్ట్రంలో హనుమకొండకు చెందిన మాధవీలత, పరిమి మనోజ్ కుమార్ దంపతుల కుమార్తె అలేఖ్య(24) ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఈమె హైదరాబాద్‌లోని పెండేకంటి కళాశాలలో 2022లో న్యాయశాస్త్ర విభాగంలో ఉత్తిర్ణులయ్యారు. అయితే అలేఖ్య గతేడాది ఏపీ హైకోర్టు నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జి నియామక పరీక్ష ఫలితాల్లో ప్రథమస్థానాన్ని సాధించారు. ప్రస్తుతం ఈమె ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఇక అలేఖ్య తల్లి మాధవీలత రంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి తన తల్లిని స్ఫూర్తిగా తీసుకున్న అలేఖ్య నేడు యువతరానికి ఆదర్శంగా నిలిచింది. దీంతో అలేఖ్యను రంగారెడ్డి జిల్లా కోర్టుల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు దీకొండ రవీందర్, ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి అభినందించారు. మరి అతి చిన్న వయసులోనే సివిల్ జడ్జి గా ఎంపికైనా ఆ యువతి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.