iDreamPost
android-app
ios-app

పాపం పగవాడికి కూడా ఇలాంటి కష్టం వద్దు.. ఇటు పరీక్ష.. అటు తండ్రి మరణం

  • Published Mar 07, 2024 | 11:58 AM Updated Updated Mar 07, 2024 | 11:58 AM

కష్టం ఎవరికి చెప్పిరాదు. ఆ వచ్చిన కష్టనికి ఎంతటి వారైనా తలవంచక తప్పదు. అయితే తాజాగా ఇంటర్ పరీక్షలు రాస్తున్నా ఓ విద్యార్థికి కూడా ఊహించని కష్టం వచ్చిపడింది. పాపం ఆ కష్టం పగవాడికి కూడా రాకూడదంటూ అందరూ కంటతడి పెట్టారు.

కష్టం ఎవరికి చెప్పిరాదు. ఆ వచ్చిన కష్టనికి ఎంతటి వారైనా తలవంచక తప్పదు. అయితే తాజాగా ఇంటర్ పరీక్షలు రాస్తున్నా ఓ విద్యార్థికి కూడా ఊహించని కష్టం వచ్చిపడింది. పాపం ఆ కష్టం పగవాడికి కూడా రాకూడదంటూ అందరూ కంటతడి పెట్టారు.

  • Published Mar 07, 2024 | 11:58 AMUpdated Mar 07, 2024 | 11:58 AM
పాపం పగవాడికి కూడా ఇలాంటి కష్టం వద్దు.. ఇటు పరీక్ష.. అటు తండ్రి మరణం

ప్రతిఒక్కరి జీవితంలో కొన్నిసార్లు కఠినమైన సవాళ్లను ఎదుర్కొవలసి ఉంటుంది. అలాంటి సమయంలో విధి రాసిన రాతను ఎవ్వరూ తప్పించుకోలేరు. ముఖ్యంగా అలాంటి సమయంలో వారు అనుభవించే బాధను మాటల్లో వర్ణించలేము.అయితే చాలా కుటుంబల్లో మాత్రం ఈ విధి ఆడిన వింత నాటకాన్ని చూస్తే పగవాడికి సైతం కంటతడి పెట్టిస్తోంది.కంటికి రెప్పలా కాపాడుకోవలసిన తండ్రి దూరమయ్యాడనే బాధ ఓ వైపు.. పరీక్షకాలం మరో వైపు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి పగవాడికి కూడా రాకుడదనే వేదనే. ఇలా అన్నిటి మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ అమ్మాయి ఆ బాధలను పంటి బిగువున భరిస్తూ.. పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ పరీక్షకు హాజరైంది. ఈ విషాదకర ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది.

విశాఖలోని ఇంటర్ విద్యార్థి ఓ వైపు తండ్రి చనిపోయిన బాధ.. మరోవైపు పరీక్షలు ఎటూ తేల్చుకోలేక పోయిన సందర్భంలో స్థానికులు ధైర్యం చెప్పి పరీక్షకు పంపించారు. పాపం ఆ అమ్మాయి తన బాధను దిగమింగుకుంటూ.. పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ పరీక్షకు హాజరైంది. ఇక పరీక్షరాసివచ్చిన తర్వాత తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. విశాఖ పారిశ్రామిక ప్రాంతం హనుమాన్‌నగర్‌కు చెందిన ఎల్‌ సోమేష్‌ గత కొంతకాలంగా కేన్సర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే ఈనెల 5వ తేదీన అతని ఆరోగ్యం క్షీణించి అర్ధరాత్రి మృతి చెందాడు. కాగా, ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉండగా.. అందులో పెద్ద కుమార్తె మానసిక స్థితి సరిగా లేదు. ఇక చిన్న కుమార్తె ఢిల్లిశ్వరి ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది.

అయితే తండ్రికి అంత్యక్రియలు నిర్వహించే బాధ్యత తనదే కాబట్టి, పరీక్షకు వెళ్లనని చిన్న కుమార్తె పట్టుబట్టింది. దీంతో స్థానికులు చిన్న కుమార్తెకు నచ్చజెప్పారు. పరీక్ష రాసి వచ్చే వరకు మృతదేహాన్ని అలాగే ఉంచుతామని చెప్పడంతో.. ఢిల్లిశ్వరి పరీక్షరాసేందుకు వెళ్లింది. అలా తండ్రి మృతి చెందిన బాధతోనే పరీక్ష రాసొచ్చి అంత్యక్రియలు నిర్వహించింది.అయితే మృతుడి పెద్ద కుమార్తెకు తన తండ్రి చనిపోయాడనే విషయం తెలుసుకోలేక.. అమ్మా ఇంటికి వెళ్లిపోదాం.. నాన్న ఇంటికి వస్తాడులే అంటుండంతో మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లితో అన్న మాటలు విని స్థానికులు చలించిపోయారు. తండ్రి చనిపోయాడన్న విషాదంలోనే పరీక్ష రాసి వచ్చిన ఢిల్లీశ్వరి కొడుకుగా మారి అంత్యక్రియలు నిర్వహించింది. మరి, తండ్రి చనిపోయిన బాధను దిగమింగుకొని, పరీక్ష రాసి వచ్చి అంతక్రియలు చేసిన విషాద ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.