Keerthi
మన దేశంలో చాలామంది వైద్య విద్యర్థులు విదేశాల్లో విద్యను అభ్యసించలని పయణమవుతుంటారు. కానీ వారిలో అలా వెళ్లిన విద్యర్థులకు అక్కడ లేనిపోని ఒత్తిడులు, బేధిరింపులు, ఇబ్బందులకు గురవుతుంటారు. తాజాగా విదేశాల్లో చదువుతున్న మరో భారతీయ విద్యార్థి కూడా తాను ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేసింది. ఆ దేశంలో వైద్య విద్యను కొనసాగించలంటే అబ్బాయిలతో అలా కలిసివుండాలని తన ఆవేదనను వ్యక్తం చేసింది.
మన దేశంలో చాలామంది వైద్య విద్యర్థులు విదేశాల్లో విద్యను అభ్యసించలని పయణమవుతుంటారు. కానీ వారిలో అలా వెళ్లిన విద్యర్థులకు అక్కడ లేనిపోని ఒత్తిడులు, బేధిరింపులు, ఇబ్బందులకు గురవుతుంటారు. తాజాగా విదేశాల్లో చదువుతున్న మరో భారతీయ విద్యార్థి కూడా తాను ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేసింది. ఆ దేశంలో వైద్య విద్యను కొనసాగించలంటే అబ్బాయిలతో అలా కలిసివుండాలని తన ఆవేదనను వ్యక్తం చేసింది.
Keerthi
మన దేశంలో చాలామంది విద్యర్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించలని పయణమవుతుంటారు. ముఖ్యంగా వీరిలో వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లిన వారే ఎక్కువ శాతం ఉంటారు.అయితే ఇలా మంచి వైద్య విద్య కోసం ఖండాంతరాలు దాటి వెళ్లేందుకు మెగ్గు చూపే విద్యార్ధులకు అక్కడ పరిస్థితిలు అంతా అనుకూలంగా ఉండవు. ఎన్నో ఆశాలు, మరెన్నో సవాళ్లను ఆర్ధిక ఇబ్బందులను దాటుకొని విదేశాల్లో అడుగుపెట్టే భారతీయ విద్యర్ధులకు అక్కడ అడుగడుగున ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అక్కడ లేనిపోని ఒత్తిడులకు, బేధిరింపులకు లోనవుతూ అటువైపు వైద్య చదువు పూర్తి కాకుండా.. ఇటు ఇండియాకు రాలేక తీవ్ర సతమతమవుతున్నారు. అయితే తాజాగా విదేశాల్లో చదువుతున్న మరో భారతీయ విద్యార్ధి కూడా తాను ఎదుర్కొంటున్న సమస్యలను ఓ వీడియోలో తెలియజేసింది. పైగా ఆ దేశంలో వైద్య విద్యను అభ్యసించాలంటే కచ్చితంగా అబ్బాయిలతో కలిసి ఉండాలని తన ఆవేదనను వ్యక్తం చేసింది.
ఎన్నో ఆశలతో విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి, వైద్యురాలిగా స్థిరపడాలనుకుంది ఓ యువతి. అందుకు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు తన కుమార్తెను డాక్టర్ గా చూడాలని తల్లిదండ్రులు తాపత్రయపడ్డారు. అందుకోసం నగరానికి చెందిన కన్సల్టెన్సీ ద్వారా కజకిస్తాన్ లో ఓ యూనివర్సిటీలో సీటు సంపాదించారు. ఇక కోటి ఆశలతో విదేశీ యూనివర్సిటీలోకి అడుగుపెట్టిన కొద్ది రోజులకే ఆ విద్యార్థికి వేధింపులు మొదలయ్యాయి. పైగా ఆ విద్యర్థికి అక్కడ హాస్టల్ లో అబ్బాయిలతో కలిపి వసతి కల్పించడంతో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ వివరాళ్లోకి వెళ్తే.. మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన జి.భవాని విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేయాలని భావించింది. ఇందుకోసం గాజువాకలో ఉన్న జీవీకే కన్సల్టెన్సీ అనే సంస్థను సంప్రదించారు. ఇక దాని ద్వారా కజకిస్తాన్ దేశంలో ఆల్మటీ నగరంలోని కాస్పియన్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీటుకు కొంత డబ్బును చెల్లించారు. అలాగే అక్కడి వసతి ఏర్పాట్లపై విద్యర్థి తండ్రి జగదీష్ కన్సల్టెన్సీ ప్రతినిధులతో స్పష్టంగా మాట్లాడారు. అయితే అక్కడి వార్ అమ్మాయిలకు, అబ్బాయిలకు ప్రత్యేక హాస్టళ్లు ఉంటాయని చెప్పడంతో వారు సీటు కోసం డబ్బును చెల్లించారు. ఇక ఈనెల 11వ తేదీన భవాని కజకిస్తాన్‌కు వెళ్లింది. అక్కడ యూనివర్సిటీలో ఒక భవనంలోనే అబ్బాయిలకు, అమ్మాయిలకు వసతి కల్పించారు.
అయితే, అక్కడ పరిస్థితులకు భవాని కొద్ది రోజులపాటు సర్దుకున్న.. ఆ వాతావరణాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోయింది. ఎందుకంటే.. అక్కడ అబ్బాయిలతో కలిసి ఉండడం, పైగా వారు సిగరెట్, ఇతర అలవాట్లను చూసి భరించలేక ఈ విషయాన్ని తన తండ్రికి తెలియజేసింది భవాని. ఇక ఈ విషయం పై భవాని తండ్రి జగదీష్ కన్సల్టెన్సీ ప్రతినిధులను సంప్రదించారు. తన కుమార్తెను వేరే హాస్టల్‌కు మార్చాలని కోరాడు. అయితే చెప్పిన కొద్దిసేపటికే భవాని రూమ్‌కు కొంత మంది సీనియర్ అబ్బాయిలు వెళ్లి ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే తప్పనిసరిగా తమతో కలిసే ఉండాలని హెచ్చరించారు. దీంతో అబ్బాయిలకు, అమ్మాయిలకు వేర్వేరుగా వసతి కల్పించినట్లు చెప్పాలని బలవంతం పెట్టడంతో భయపడిన భవాని మళ్లీ తన తండ్రికి ఫోన్ చేసి వేరే హాస్టల్‌కు మార్పించినట్లు చెప్పింది.
అయినా.. అక్కడి వాతావరణాన్ని భరించలేని భవాని తాను ఇక్కడ ఉండలేనని, తనని ఇంటికి పంపించేయాలని కళాశాల వాళ్లను వేడుకుంది. కనీ, వాళ్లు మొత్తం ఫీజు చెల్లిస్తేనే తిరిగి పంపిస్తామంటూ ఆమె పాస్‌పోర్ట్ ను ఇవ్వకుండా వేధింపులకు గురిచేయడం ప్రారంభించారు. దీంతో ఆమె ఈ విషయాన్ని తండ్రి జగదీష్ కు చెప్పింది. అలాగే ఇక్కడ హాస్టల్‌లో పరిస్థితులు బాగోలేవని, తాను ఇంటికి వెళ్లేందుకు సహాయం చేయాలని అధికారులను కోరుతూ ఓ సెల్ఫీ వీడియో తీసి పంపించింది. దీనిపై తండ్రి జగదీష్ గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెకు ఎలాగైనా తిరిగి విశాఖకు రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాడు. మరి, విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలని వెళ్లిన ఆ విద్యార్థి ఎదుర్కొంటున్న ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.