iDreamPost
android-app
ios-app

AP: బాంబులా పేలిన ఎలక్ట్రిక్ బైక్‌.. ఇంత డేంజరా?

  • Published Feb 09, 2024 | 8:50 PM Updated Updated Feb 09, 2024 | 8:50 PM

ఇటీవల కాలంలో ఎలక్టికల్ బైక్స్ వల్ల జరుగుతున్నా ప్రమాదాలు తరుచూ వింటునే ఉన్నాం. తాజాగా మరోసారి విశాఖపట్నం లో చోటు చేసుకున్న ఘటనకు భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు.

ఇటీవల కాలంలో ఎలక్టికల్ బైక్స్ వల్ల జరుగుతున్నా ప్రమాదాలు తరుచూ వింటునే ఉన్నాం. తాజాగా మరోసారి విశాఖపట్నం లో చోటు చేసుకున్న ఘటనకు భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు.

  • Published Feb 09, 2024 | 8:50 PMUpdated Feb 09, 2024 | 8:50 PM
AP: బాంబులా పేలిన ఎలక్ట్రిక్ బైక్‌.. ఇంత డేంజరా?

దేశంలో అత్యధునిక టెక్నాలజీ పెరగడంతో.. మనుషల జీవనశైలిలో కూడా క్రమంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.ఈ క్రమంలోనే ప్రజలు ప్రతిఒక్క చిన్న విషయంలోను అప్ డేట్ గా ఉంటున్నారు. అలాగే ఈమధ్యకాలంలో ఎలక్ట్రిక్ బైక్స్ అనేవి మార్కెట్ లో అందుబాటులోకి వచ్చాయి. దీంతో చాలామంది ప్రజలు వాటిని వినియోగించడం మొదలుపెట్టారు. దీనివలన పెట్రోల్ అదా అవుతుందనే ఉద్దేశంతో ఎంతో మంది దీనిని కొనుగొలు చేస్తున్నారు. అయితే దీనికి కేవలం ఛార్జింగ్ పెడితే చాలు. మళ్లీ అది ఛార్జింగ్ అయిపోయంత వరకు వాడుకోవచ్చు. ఇంత మంచి సదుపాయం కలిగిన ఈ ఎలక్ట్రిక్ బైక్స్ అనేవి ఇప్పుడు ప్రతిఒక్కరి దగ్గర ఉన్నాయి. ఇటీవల కాలంలో వీటి వలన అనేక ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. చాలా ప్రాంతాల్లో ఈ బైక్స్ ను నడుపుతుండగా మంటలు వ్యాపించడం వంటి సంఘటనలు ఎన్నోం విన్నాం. అయితే తాజాగా ఇలాంటి ఘటనే మరోసారి విశాఖపట్నంలో చోటుచేసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

విశాఖపట్నంలోని 90వ వార్డు బుచ్చిరాజుపాలెం సీతారామరాజు నగర్ లోని అపూర్వ ఎన్‌క్లేవ్ అనే అపార్ట్‌మెంట్లో గురువారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు వెంటనే.. మర్రిపాలెం అగ్నిమాపక సిబ్బంది కి సమాచారం అందించారు. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. అపూర్వ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో ఉంటున్న సంతోష్ కుమార్.. భవనం సెల్లార్లో తన టూ వీలర్ ( ఎలక్ట్రిక్) వాహనం చార్జింగ్ పెట్టాడు. అయితే ఆ బైక్ కి ఛార్జింగ్ పెట్టి రెండు గంటలు గడిచింది. దీంతో.. ఆ బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి అమాంతం మంటలు ఎగసిపడ్డాయి. ఈ మంటలు అపాడానికి స్థానికులు ఎవరు సాహసం చేయలేదు.

ఎందుకంటే.. అక్కడ కరెంటు తీగలు కూడా ఉన్నాయి. అలాగే పక్కనున్న మీటర్లు కూడా కాలిపోతుండటంతో ఆ భవనంలో నివసించే వ్యక్తులు వెంటనే భయంతో బయటకు వచ్చేసారు. చుట్టుపక్కల వారంతా పరుగులు తీశారు. అలాగే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ ప్రమాద తీవ్రత, మంటలకు భయపడి భారీగా గుమి గూడారు. ఎట్టకేలకు మంటలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, బైక్ మాత్రం పూర్తిగా దగ్ధం అయిపోయింది. దీంతో ఎలక్ట్రిక్ లు బైక్ వాడుతున్న వారు అప్రమాత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మరి, ఎలక్ట్రిక్ బైక్ ఛార్జింగ్ పెట్టి అదమరచడంతో జరిగిన ప్రమాదం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.