iDreamPost
android-app
ios-app

నకిలీ SI ఘరానా మోసం.. నిండా ముంచేసింది

  • Published Mar 08, 2024 | 8:27 AM Updated Updated Mar 08, 2024 | 8:27 AM

ఈ మధ్యకాలంలో నిరుద్యోగం పేరుతో చాలామంది కేటుగాళ్లు యువతను మోసం చేసి భారీ మొత్తంలో నగదును దోచుకుంటున్నారు. తాజాగా మరోసారి పోలీసులా రూపంలో వచ్చి ఏకంగా అన్ని కోట్లను దోచుకున్నారు

ఈ మధ్యకాలంలో నిరుద్యోగం పేరుతో చాలామంది కేటుగాళ్లు యువతను మోసం చేసి భారీ మొత్తంలో నగదును దోచుకుంటున్నారు. తాజాగా మరోసారి పోలీసులా రూపంలో వచ్చి ఏకంగా అన్ని కోట్లను దోచుకున్నారు

  • Published Mar 08, 2024 | 8:27 AMUpdated Mar 08, 2024 | 8:27 AM
నకిలీ SI ఘరానా మోసం.. నిండా ముంచేసింది

ఇటీవల కాలంలో నిరుద్యోగంతో బాధపడుతున్న యువతకు చాలామంది కేటుగాళ్లు బురిడి కొట్టిస్తున్నారు.మంచి ఉద్యోగా అవకాశలు ఇప్పిస్తామంటూ ఆశ చూపి వారిని నిలువున ముంచేస్తున్నారు. ఈ మధ్యకాలంలో అయితే మరి ఎక్కువగా యువత ఇటువంటి వలలో చిక్కుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ మాయ కేటుగాళ్లు లక్షలు కొలది డబ్బును దండుకొని పరారు అవుతున్నారు. ఇక మోసపోయమని గ్రహించిన యువత చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కానీ, తాజాగా జరిగిన ఓ ఘటనలో మాత్రం ఏకంగా ఖాకీ వేషధారణలో ఉన్న కొంతమంది గ్యాంగ్.. నిరుద్యోగంతో బాధపడుతున్న యువతకు టోకరా పెట్టారు. దాదాపు 30 మంది యువత వద్ద అన్ని కోట్ల రూపాయలను దండుకోని మాయమయ్యారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

పోలీసు ఎస్సైల వేషధారణలో ఉన్న కొంతమంది గ్యాంగ్.. పోలీసు శాఖలో ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విశాఖలో నిరుద్యోగులను మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందుతుడు హనుమంతు రమేష్, అతని ప్రియురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ గత కొంతకాలంగా మరి కొందరితో కలిసి నిరుద్యోగుల నుంచి దాదాపు రూ. 3 కోట్లు వసూలు చేసి మోసం చేశారు. అయితే బాధితుల కథనం ప్రకారం.. తరుచు మోసాలతోనే బతికే హనుమంతు రమేష్(47) అడవివరంలోని ఆర్ఆర్ టవర్స్ లో ఉంటున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు (అక్కచెల్లెలు) కూడా ఉండగా.. ఇటీవలే మరో ప్రియురాలితో ఉంటున్నాడు. ఇదిలా ఉంటే.. హనుమంతు గత కొంతకాలంగా ప్రియురాలు, మరికొందరితో కలిసి రాష్ట్ర పోలీసు శాఖలో ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామని యువకులకు ఆశ చూపించారు. ఈ క్రమంలోనే ఈ ముఠాకు పలువురు మధ్యవర్తులు సహకరించారు. కాగా, హనుమంతు అతని ప్రియురాలు, మిగతా వారు పోలీసు ఎస్సైల గెటప్ లో రావడంతో వారంతా నిజమైన పోలీసులని వారంతా నమ్మేశారు. ఈ క్రమంలోనే ఇప్పటికి దాదాపు 30 మంది వరకు రూ.3 కోట్ల వరకు నగదును దోచుకొని మాయమయ్యారు.

దీంతో మోసపోయామని తెలుసుకున బాధిత యువత పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇటీవలే నగర పోలీసులు రంగంలోకి దిగారు. కాగా, నిందితులు హైదరాబాద్ లో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక పోలీసు కమిషనర్ సూచనలతో.. టాస్క్ ఫోర్స్ బృందాలు హైదరాబాద్ వెళ్లి హనుమంతు రమేష్ ను అతడి ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నారు.కాగా, ప్రధాన మోసగాళ్లైన వీరిద్దరిని గురువారం సాయంత్రం టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకొచ్చారు. అనంతరం నగర పోలీసు కమిషనర్ ఎదుట హాజరుపరిచారు. ఇక అనంతరం వారిని రహస్య ప్రాంతానికి తరలించి విచారణ జరుపుతున్నట్లు సమాచారం తెలిసింది. మరి, ఉద్యోగం పేరుతో పోలీసుల గెటప్ లో వచ్చి యువతను మోసం చేసే ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.