Keerthi
ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు తమ పిల్లలను కార్పొరేట్ స్కూల్లలో చేర్పించి లక్షల కొలది ఫీజులు కడుతు చదివిస్తుంటే.. ఓ ఐఏఎస్ అధికారిని మాత్రం అందుకు భిన్నంగా అందరిని ఆశ్చర్యపరిచేలా చేశారు. అసలు ఏం జరిగిదంటే..
ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు తమ పిల్లలను కార్పొరేట్ స్కూల్లలో చేర్పించి లక్షల కొలది ఫీజులు కడుతు చదివిస్తుంటే.. ఓ ఐఏఎస్ అధికారిని మాత్రం అందుకు భిన్నంగా అందరిని ఆశ్చర్యపరిచేలా చేశారు. అసలు ఏం జరిగిదంటే..
Keerthi
సాధారణంగా ప్రతిఒక్క తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటారు. వారికి మంచి విద్యను అందించి ఉన్నత స్థాయిలో చూడాలని ఆశపడుతుంటారు. ఇందుకోసం ఎవరి స్థాయి తగ్గటుగా వారు కష్టపడి తమ పిల్లలను చదివిస్తుంటారు. ఈ క్రమంలోనే.. మధ్యతరగతి కుటుంబలు తమ పిల్లలను చిన్న వయసు నుంచే విద్యను అభ్యసించడానికి అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పిస్తారు.అయితే పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వ్యక్తులు కోటిశ్వరులు,సెలబ్రీటీస్ మాత్రం తమ పిల్లలను పెద్ద కార్పొరేట్ స్కూల్లలో చేర్పించి లక్షల కొలది ఫీజులు కడుతు చదివిస్తున్న సంగతీ తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఐఏఎస్ అధికారి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న ఆమె తన కుమార్తెను మధ్యతరగతి పిల్లల పెంచుతూ అందరికి ఆదర్శంగా నిలిచింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
సహజంగా అంగన్‌వాడీ కేంద్రలంటే.. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన పిల్లలు మాత్రమే కనిపిస్తారు. కానీ, అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సూరజ్ గనోరే మాత్రం అందుకు భిన్నంగా అందరికి ఆశ్చర్యపరిచేలా చేశారు. తన మూడేళ్ల వయసున్న కుమార్తె సృష్టి గనోరేను స్థానిక ఎర్రంరెడ్డి నగరంలోని ఉన్న ఓ అంగన్‌వాడీ కేంద్రంలో చేర్చారు. ఈ విధంగా అంగన్‌వాడీ కేంద్రాలపై ప్రజలకు నమ్మకం పెరిగేలా.. 10 మందికి ఆదర్శంగా నిలిచారని కార్యకర్తలు ప్రశంసించారు. ఇలా అంగన్‌వాడీ కేంద్రంలో తన కుమార్తెను చేర్పించలనుకున్న సూరజ్ గనోరే నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే ఐటీడీఏ పీవో సూరజ్ గనోరే ఏజెన్సీలో బాగా చదువుతున్న విద్యార్థులను గుర్తించి ఢీల్లీలో రిపబ్లిక్, స్వాతంత్య్ర దినోత్సవాలకు పంపిస్తామని పేర్కొన్నారు. కాగా, ఇటీవలే ఈ ఐటీడీఏకు చెందిన నలుగురు విద్యార్థులు ఈ నెల 26న ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొని ప్రధానిని కలిసి వచ్చారు. అందుకు వారిని సోమవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో సత్కరించారు. అయితే రాష్ట్రం నుంచి 30 మంది విద్యార్థులను ఢీల్లీలో పంపించగా.. వారిలో నలుగురు రంపచోడవరం ప్రాంతానికి చెందిన వారు కావడం సంతోషకరమైన విషయం అంటు సూరజ్ తెలిపారు. మరి, ఐఏఎస్ స్థానంలో ఉన్న సూరజ్ తన కుమార్తెను అంగన్‌వాడీలో చేర్పించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.