అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్న ఏజెంట్ ఎట్టకేలకు రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్నట్టు తెలిసింది. అధికారికంగా అనౌన్స్ చేయలేదు కానీ ఏప్రిల్ 14 రావడం దాదాపు ఖాయమే. ఏదో సింపుల్ గా ప్రకటించకుండా ఒక చిన్న ఈవెంట్ తో ఫ్యాన్స్ కి ఈ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టు సమాచారం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పై డ్రామాకు ధృవ ఫేమ్ హిప్ హాప్ తమిజా సంగీతం సమకూరుస్తున్నారు. మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి ముఖ్యమైన పాత్ర […]
ఒకప్పుడు ప్యాన్ ఇండియా పదమే మనకు పరిచయం లేనిది. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ ని మించిపోయేలా జపాన్ లాంటి దేశాల్లో కూడా మన గురించి గొప్పగా చెప్పుకునేలా రాజమౌళి లాంటి దర్శకులు తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేస్తున్నారు. పక్కరాష్ట్రంలో ప్రశాంత్ నీల్ ఇచ్చిన కెజిఎఫ్, రిషబ్ శెట్టి తీసిన కాంతారలు న్యూ జనరేషన్ మేకర్స్ ని స్ఫూర్తినిస్తున్నాయి. అందుకే హిందీలో కంటే ఎక్కువగా ఇప్పుడు టాలీవుడ్ లోనే భారీ చిత్రాల నిర్మాణం ఊపందుకుంది. అన్నీ మన […]
2023 సంక్రాంతి పండగ మాములు వేడెక్కడం లేదు. ఇప్పటికే ఫిక్స్ అయిన నాలుగు రిలీజులకే థియేటర్లు ఎలా సర్దుబాటు చేయాలో డిస్ట్రిబ్యూటర్లకు అంతు చిక్కడం లేదు. ఓవర్సీస్ లో ఆల్రెడీ స్క్రీన్లను ముందస్తుగా లాక్ చేసుకోవడం మొదలైపోయిందనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఇంత టఫ్ సిచువేషన్ లో అఖిల్ ఏజెంట్ కూడా పొంగల్ కే వస్తుందంటూ నిర్మాతలు వదిలిన కొత్త పోస్టర్ ఫిలిం నగర్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఆది పురుష్, […]
ప్రస్తుతం ఏజెంట్ చేస్తున్న అఖిల్ నెక్స్ట్ ఏ దర్శకుడితో చేయబోయేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం గాడ్ గాదర్ ని డైరెక్ట్ చేస్తున్న మోహన్ రాజాతో దాదాపుగా లాక్ అయినట్టేనని అక్కినేని కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న మాట. చిరంజీవిని హ్యాండిల్ చేసిన విధానాన్ని రషెస్ లో చూసిన నాగార్జున దాని అవుట్ ఫుట్ పట్ల ఇంప్రెస్స్ అయిపోయి కొడుకుని ప్రోత్సహించినట్టు తెలిసింది. అయితే ఎలాంటి జానర్, ఏ సబ్జెక్టుని ఎంచుకున్నారు లాంటి […]
అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఏజెంట్ మీద అక్కినేని అభిమానుల అంచనాలు మాములుగా లేవు. అయితే షూటింగ్ పలుమార్లు రీ షూట్ కు వెళ్ళిందని, నిర్మాణ భాగస్వామ్యం నుంచి సూరి తప్పుకున్నారని కొన్ని మీడియా సైట్స్ లో వచ్చిన వార్తలు చూసి ఫ్యాన్స్ ఖంగారు పడ్డారు. కానీ అలాంటిదేమి లేదట. ఇవాళ నుంచి కులుమనాలిలో ఫ్రెష్ షెడ్యూల్ మొదలుపెట్టారు. ఈ మేరకు నిర్మాత అనిల్ సుంకర తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో క్లారిటీ […]
మాస్ ని బలంగా ఆకట్టుకుంటుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న అఖిల్ కొత్త సినిమా ఏజెంట్ ఆగస్ట్ 12 రావడం డౌటే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. ఇంకా షూటింగ్ పెండింగ్ ఉండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం దర్శకుడు సురేందర్ రెడ్డి కొంత ఎక్కువ సమయం కోరడంతో ఒత్తిడితో విడుదల చేయడం గురించి నిర్మాత అనిల్ సుంకర పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఇది పక్కాగా తెలుసుకునే నితిన్ మాచర్ల నియోజకవర్గం నిర్మాతలు ఆగస్ట్ 12కి ఫిక్స్ […]