iDreamPost
android-app
ios-app

అఖిల్ లిస్టులో మరో క్రేజీ డైరెక్టర్

  • Published May 23, 2022 | 12:13 PM Updated Updated May 23, 2022 | 12:24 PM
  • Published May 23, 2022 | 12:13 PMUpdated May 23, 2022 | 12:24 PM
అఖిల్ లిస్టులో మరో క్రేజీ డైరెక్టర్

ప్రస్తుతం ఏజెంట్ చేస్తున్న అఖిల్ నెక్స్ట్ ఏ దర్శకుడితో చేయబోయేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం గాడ్ గాదర్ ని డైరెక్ట్ చేస్తున్న మోహన్ రాజాతో దాదాపుగా లాక్ అయినట్టేనని అక్కినేని కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న మాట. చిరంజీవిని హ్యాండిల్ చేసిన విధానాన్ని రషెస్ లో చూసిన నాగార్జున దాని అవుట్ ఫుట్ పట్ల ఇంప్రెస్స్ అయిపోయి కొడుకుని ప్రోత్సహించినట్టు తెలిసింది. అయితే ఎలాంటి జానర్, ఏ సబ్జెక్టుని ఎంచుకున్నారు లాంటి వివరాలేమీ తెలియదు. గాడ్ ఫాదర్ విడుదల ఎలాగూ ఇంకో రెండు మూడు నెలల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి దాని ఫలితం వచ్చాకే నిర్ణయం ప్రకటించవచ్చు.

ఇప్పటిదాకా అన్నీ లవ్ స్టోరీసే చేసి కెరీర్ లో పెద్ద బ్రేక్ అందుకోలేకపోయిన అఖిల్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కేవలం కొంత ఊరటను కలిగించింది. సక్సెసే కానీ బ్లాక్ బస్టర్ రేంజ్ అయితే కాదు. కానీ మాస్ కి చేరువవ్వాలంటే యాక్షన్ కథలే కరెక్ట్. అందుకే సురేందర్ రెడ్డితో చేతులు కలిపారు. ఆగస్ట్ రిలీజ్ అన్నారు వాయిదా పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా బాలన్స్ పార్ట్ చాలా ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఇప్పుడున్న సమయం సరిపోకపోవడం లాంటి కారణాల వల్ల పోస్ట్ పోన్ తప్పదంటున్నారు. అనిల్ సుంకర నిర్మాణంలో ఇప్పటిదాకా అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ఇది రూపొందుతుండటం విశేషం.

ఇక ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం హనుమాన్ జంక్షన్ చేసి పూర్తిగా కోలీవుడ్ లో సెటిలైపోయిన మోహన్ రాజా ఇప్పుడు తెలుగులోనే స్థిరపడేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. గాడ్ ఫాదర్ అవుట్ ఫుట్ గురించి ఇండస్ట్రీలో పాజిటివ్ టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో స్టార్ హీరోలు తనతో చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ధృవ తమిళ ఒరిజినల్ వెర్షన్ తని ఒరువన్ ఈయన తీసిందే. రీమేక్ అడిగారు కానీ ఏవో కారణాల వల్ల చేయలేకపోయారు. ఇప్పుడు చిరంజీవి లాంటి సీనియర్లు అఖిల్ లాంటి న్యూ జనరేషన్ స్టార్ కిడ్లు ఆఫర్లు ఇవ్వడం కంటే తనకు కావాల్సింది ఏముంటుంది. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కాబట్టి ఇంతకన్నా ఏం చెప్పలేం

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom