iDreamPost
android-app
ios-app

Akhil AGENT ఏజెంట్ వెనుక ఏం జరుగుతోంది

  • Published May 17, 2022 | 11:43 AM Updated Updated May 17, 2022 | 11:43 AM
Akhil AGENT ఏజెంట్ వెనుక ఏం జరుగుతోంది

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఏజెంట్ మీద అక్కినేని అభిమానుల అంచనాలు మాములుగా లేవు. అయితే షూటింగ్ పలుమార్లు రీ షూట్ కు వెళ్ళిందని, నిర్మాణ భాగస్వామ్యం నుంచి సూరి తప్పుకున్నారని కొన్ని మీడియా సైట్స్ లో వచ్చిన వార్తలు చూసి ఫ్యాన్స్ ఖంగారు పడ్డారు. కానీ అలాంటిదేమి లేదట. ఇవాళ నుంచి కులుమనాలిలో ఫ్రెష్ షెడ్యూల్ మొదలుపెట్టారు. ఈ మేరకు నిర్మాత అనిల్ సుంకర తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి పుకార్లు నమ్మవద్దని, అనుకున్న ప్రకారమే అన్ని జరుగుతున్నాయని, త్వరలోనే టీజర్ కు సంబంధించిన అప్డేట్ ఇస్తామని స్పష్టంగా చెప్పారు.

ఇదంతా బాగానే ఉంది కానీ ఇంతకీ ఏజెంట్ ముందు చెప్పిన ఆగస్ట్ 12 వస్తాడా రాడా అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అదే రోజు మాచర్ల నియోజకవర్గం ప్రకటించడం, 11న అమీర్ ఖాన్ నాగ చైతన్యల లాల్ సింగ్ చద్దా రిలీజ్ కానుండటం లాంటి పరిణామాలు పరిస్థితిని ఆసక్తికరంగా మార్చేశాయి. సో ఏజెంట్ డ్రాప్ అవ్వడం వల్లే నితిన్ సినిమా లైన్లోకి వచ్చిందనే కామెంట్స్ ఉన్నాయి. అదే జరిగితే ఏజెంట్ ఎప్పుడు వస్తుందనేది చూడాలి. దీపావళి లేదా డిసెంబర్ రెండు ఆప్షన్లు ఉంటాయి. 2023 సంక్రాంతికి తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఏజెంట్ లాంటి యాక్షన్ ఎంటర్ టైనర్లు సోలోగా వస్తేనే బెటర్.

మమ్ముట్టి ఇందులో కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. సాక్షి వైద్య హీరోయిన్. ముందు తమన్ ను అనుకున్నా ఏవో కారణాల వల్ల ఆ స్థానంలోకి హిప్ హాప్ తమిజా వచ్చి చేరాడు. ధ్రువ, కృష్ణార్జున యుద్ధం తర్వాత అతను కంపోజ్ చేస్తున్న టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ ఇదే. అఖిల్ కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న ఏజెంట్ లో అఖిల్ స్పై ఏజెంట్ గా కనిపించనున్నాడు. జేమ్స్ బాండ్ స్టైల్ లో ఎప్పుడూ చూడని ఒక సరికొత్త ఎంటర్ టైనర్ ని సురేందర్ రెడ్డి అందిస్తారట. దీనికోసమే సిక్స్ ప్యాక్ బాడీతో పాటు ఒంటిని బాగా కష్టపెట్టిన అఖిల్ దీంతో మాస్ కి దగ్గరవుతాననే నమ్మకంతో ఉన్నాడు. చూడాలి మరి ఎప్పుడు బరిలో దిగబోతున్నాడో.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet