iDreamPost
android-app
ios-app

Akhil’s ‘Agent ఏజెంట్ వాయిదా తప్పదా

  • Published May 10, 2022 | 4:39 PM Updated Updated May 10, 2022 | 4:41 PM
Akhil’s ‘Agent ఏజెంట్ వాయిదా తప్పదా

మాస్ ని బలంగా ఆకట్టుకుంటుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న అఖిల్ కొత్త సినిమా ఏజెంట్ ఆగస్ట్ 12 రావడం డౌటే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. ఇంకా షూటింగ్ పెండింగ్ ఉండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం దర్శకుడు సురేందర్ రెడ్డి కొంత ఎక్కువ సమయం కోరడంతో ఒత్తిడితో విడుదల చేయడం గురించి నిర్మాత అనిల్ సుంకర పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఇది పక్కాగా తెలుసుకునే నితిన్ మాచర్ల నియోజకవర్గం నిర్మాతలు ఆగస్ట్ 12కి ఫిక్స్ అయ్యారని వినికిడి. అదే రోజు సమంత యశోద ఉన్నప్పటికీ అది ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టు కావడంతో అంత రిస్క్ ఉండకపోవచ్చని వాళ్ళ అభిప్రాయం.

ఏజెంట్ ఒకవేళ నిజంగా పోస్ట్ పోన్ అయితే అది మంచి నిర్ణయమే. ఎందుకంటే ఆగస్ట్ 11న లాల్ సింగ్ చద్దా వస్తోంది. అందులో అమీర్ ఖాన్ తో పాటు ప్రత్యేక పాత్రలో నాగ చైతన్య ఉన్నాడు. తెలుగు వెర్షన్ కూడా రెడీ అవుతోంది. సో ఒక్క రోజు గ్యాప్ తో అన్నదమ్ముల క్లాష్ అంత సేఫ్ కాదు. పైగా లాల్ సింగ్ చద్దాని ఇండియా వైడ్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఏజెంట్ కూడా అదే రేంజ్ మూవీ కావడంతో పోటీకి వెళ్లడం వల్ల నార్త్ లో థియేటర్ల సమస్య ఏర్పడుతుంది. ఈ కారణంగానే ఏజెంట్ ని రేస్ నుంచి తప్పించడమే బెటరని భావించి ఉండొచ్చు. దసరా లేదా దీపావళికి షిఫ్ట్ అయ్యే ఆలోచన ఉందట. డిసెంబర్ కు వెళ్లేంత ఆలస్యం చేయకపోవచ్చు.

ఇదింకా అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది. ఏజెంట్ స్థానంలో చిరంజీవి గాడ్ ఫాదర్ రావొచ్చనే ప్రచారం కూడా ఉంది. కానీ యూనిట్ నుంచి అలాంటి సూచనలేమి లేదు. దానికి ఇంకా వర్క్ పెండింగ్ లో ఉంది. విదేశాల్లో ఉన్న మెగాస్టార్ తిరిగి వచ్చాక దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటారు. ఏజెంట్ వాయిదా అంటే ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూసే కానీ సోలో రిలీజ్ కావడం ఇలాంటి వాటికి సేఫ్ గేమ్ అనిపించుకుంటుంది. పైగా బడ్జెట్ మాములుగా ఖర్చవ్వలేదు. అనవసరమైన కాంపిటీషన్ లో దిగితే పెట్టుబడులు రిస్క్ లో పడతాయి. సో ఇంకో రెండు మూడు వారాల్లో ఏజెంట్ విడుదల గురించిన క్లారిటీ వచ్చేస్తుంది.

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomgrandpashabetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom