ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి మేరకు పేదల ఇళ్ళకు, పోలవరం ప్రాజెక్టుకు, వివిధ ప్రభుత్వ పనులకు సరఫరా చేసే సిమెంటు రేట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి, తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివిధ సిమెంట్ కంపెనీల యజమానులు, ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి, ప్రస్తుతం మార్కెట్లో సిమెంటు బస్తా రేటు 380 వరకు ఉండగా , సి.యం జగన్ విజ్ఞప్తి మేరకు 235 రూపాయలకే ఇవ్వనున్నట్టు ప్రకటించాయి. గత 5ఏళ్లతో పోలిస్తే 235 […]
కరోనా వైరస్ కారణంగా ప్రపంచం వణుకుతుంటే దేశంలో రాజకీయాలు మాత్రం వేడెక్కుతున్నాయి. కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ ప్రకటించడంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల కమీషనర్ తీరుపై బహిరంగ విమర్శలు చేశారు. కాగా ఇప్పుడు కరోనా సెగ మధ్యప్రదేశ్ రాజకీయాలను కూడా తాకింది. మధ్యప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈరోజు మధ్యప్రదేశ్ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నేడు అసెంబ్లీలో […]
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తున్నట్టు ఆంద్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదివారం సంచలనం నిర్ణయం తీసుకోవడం, ఆ వెంటనే ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం పై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ అంశంపై తాము గవర్నర్ కి ఫిర్యాదు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానధికారి ఎన్.రమేష్‌కుమార్ సోమవారం ఉదయం గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ ని కలవడం ప్రాధాన్యత […]
స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేసిన నేపథ్యంలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మరో కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. సీఎం జగన్ ప్రెస్‌మీట్‌పై కౌంటర్‌గా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాజాగా నోటిపికేషన్ జారీ చేయాలన్నారు. ఈ విషయంపై తాము అన్ని కోణాల్లో పోరాడతామన్నారు. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని చెప్పిన చంద్రబాబు… […]